Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (11/3/2025)

Daily Horoscope Today In Telugu, March 11, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-11 00:59 GMT
Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (11/3/2025)
  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 11, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి : ద్వాదశి ఉదయం గం.8.13 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి

నక్షత్రం: ఆశ్లేష అర్ధరాత్రి దాటాక తె.వా.గం.2.15 ని.ల వరకు ఆ తర్వాత మఖ

అమృతఘడియలు: ఇవాళ్టి అర్ధరాత్రి గం.12.33 ని.ల నుంచి తె.వా. గం.2.15 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.24 ని.ల నుంచి గం.4.05 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.51 ని.ల నుంచి గం.9.39 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.14 ని.ల చి అర్ధరాత్రి గం.12.02 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.27 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 6.25 ని.లకు

మేషం :

వ్యవహారాల్లో తొందరపాటు వల్ల నష్టపోతారు. అడ్డంకులు సృష్టించేవారూ పెరుగుతారు. మనసు నిలకడగా ఉండదు. అవమానాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త.

వృషభం :

సహచరుల తోడ్పాటు లభిస్తుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. వృత్తి నైపుణ్యానికి తగ్గ గౌరవాన్ని పొందుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. సోదరుల వ్యవహారాలు ఆనందపరుస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం :

అనుకున్నవి సవ్యంగా సాగవు. అకారణ విరోధాలకు ఆస్కారముంది. నోటిదురుసు మంచిది కాదు. వేళకు భోజనముండదు. కుటుంబంలోనూ చికాకులు తలెత్తుతాయి. నిజాయితీని వదలకండి. అనవసర జోక్యం వద్దు.

కర్కాటకం:

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ధనలాభం ఉంది. అదృష్టం వరిస్తుంది. వాహనయోగం గోచరిస్తోంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది.

సింహం :

జరుగుతున్న పరిణామాలు మనసుకి కష్టం కలిగిస్తాయి. అన్ని పనులకూ అడ్డంకులుంటాయి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. పోటీలకు దిగకండి. అనూహ్య ఖర్చుంటుంది.

కన్య :

కోరిక నెరవేరుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. ఇష్టమైన వస్తువులను సేకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆత్మీయులతో సరదాగా గడుపుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. స్నేహితులు సహకరిస్తారు.

తుల :

అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. ఉన్నత స్థానంలోని వ్యక్తుల సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన నైపుణ్యానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం ఉంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు.

వృశ్చికం :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. బద్ధకాన్ని వదిలి పెట్టాలి. ప్రయాణం వల్ల లాభముండదు. సంతానంతో విభేదిస్తారు. అశాంతి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

ధనుస్సు :

ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. రుణ ప్రయత్నాలు కొలిక్కిరావు. తగాదాలకు ఆస్కారముంది. మాట తూలకండి. శత్రుపీడ ఉంటుంది. మిత్రులూ తోడుండరు. మనశ్శాంతిఉండదు. అజీర్తి సమస్య ఏర్పడుతుంది.

మకరం :

ప్రయత్నం ఫలిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. విందుకు హాజరవుతారు.

కుంభం :

శుభ ఫలితాలను పొందుతారు. వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. అపార్థాలు తొలగిపోతాయి. మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది.

మీనం :

బద్ధకిస్తే నష్టపోతారు. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా పనిచేయాలి. అభీష్టం నెరవేరే సూచన లేదు. విరోధం పెరిగే అవకాశం ఉంది. వ్యవహారాల్లో జాగ్రత్త. సమర్థతను నిరూపించుకునే అవకాశం ఉండదు. ఖర్చు తగ్గించండి.

శుభమస్తు

Tags:    

Similar News