Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (10/3/2025)

Daily Horoscope Today In Telugu, March 10, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-09 18:30 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 10, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: ఏకాదశి ఉదయం గం.7.44 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: పుష్యమి అర్ధరాత్రి గం.12.51 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష

అమృతఘడియలు: సాయంత్రం గం.6.12 ని.ల నుంచి గం.7.52 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.8.14 ని.ల నుంచి గం.9.53 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.50 ని.ల నుంచి గం.1.38 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.14 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.7.30 ని.ల నుంచి గం.9.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.28 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.25 ని.లకు

మేషం 

వ్యవహారాలు సజావుగా సాగవు. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. రహస్యాలు రట్టయ్యే వీలుంది. రియల్ ఎస్టేట్, మైనింగ్, విద్యారంగాల్లోని వారు. ఆచితూచి నడచుకోవాలి.

వృషభం 

ఆలోచనలను చక్కగా అమల్లో పెడతారు. నాయకత్వ పటిమను కనబరుస్తారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సోదరుల సమస్యలు పరిష్కరిస్తారు. ప్రయాణ ప్రయోజనాన్ని పొందుతారు.

మిథునం 

ఆలోచనలు మందగిస్తాయి. తొందరపాటు నిర్ణయం వల్ల సమస్య వస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

విధి నిర్వహణలో ప్రశంసలను పొందుతారు. మీ ఉన్నతికి దోహదపడే ఘటనలు జరుగుతాయి. అంతులేని ఆనందం ఉంటుంది. గృహావసరాలను తీరుస్తారు. బాల్య స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం 

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీగా నష్ట పరిహారం చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లే వీలుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు.

కన్య 

సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. మనశ్శాంతి ఉంటుంది.

తుల 

వ్యవహారాలు విజయవంతం అవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. విందుకు హాజరవుతారు.

వృశ్చికం 

కార్యాలకు అడ్డంకులు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడుతుంది. గొడవలకు దూరంగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు 

అనుకున్న రీతిలో పనులు సాగవు. ధన సంబంధ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. పోటీల్లో పాల్గొనకండి. ఇష్టం లేని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అజీర్తి సమస్య ఉంటుంది.

మకరం 

కోరిక తీరుతుంది. సంతాన సంబంధ శుభవార్తను వింటారు. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణం వల్ల ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. విందుకు హాజరవుతారు.

కుంభం 

వ్యవహారాలన్నీ ఆశించినట్లే సాగుతాయి. కీలక వ్యవహారంలో మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యంపై అపోహలు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మనశ్శాంతిని పొందుతారు.

మీనం 

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. అనవసర జోక్యం వల్ల విరోధం ఏర్పడుతుంది. కార్య నిర్వహణ సామర్థ్యం పెరుగుగుతుంది. విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచన ఉంది.

Tags:    

Similar News