Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (18/3/2025)

Daily Horoscope Today In Telugu, March 18, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-17 20:45 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 18, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి: చవితి రాత్రి గం.10.09 ని.ల వరకు

నక్షత్రం: స్వాతి సాయంత్రం గం.5.52 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ

అమృతఘడియలు: ఉదయం గం.7.56 ని.ల నుంచి గం.9.44 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం.12.09 ని.ల నుంచి గం.1.57 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.47 ని.ల నుంచి గం.9.35 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.12 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.00 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.22 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.27 ని.లకు

మేషం 

అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆశించిన మేర ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయాణం వినోదంగా సాగుతుంది.

వృషభం 

వ్యవహారాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైన వేళ మిత్రులు తోడుగా నిలుస్తారు. విందుల్లో పాల్గొంటారు.

మిథునం 

బద్ధకం వదిలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అభీష్టం నెరవేరే సూచన లేదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనుమానం వదిలిపెట్టండి. శిక్షణ వ్యవహారాలు అనుకూలించవు. మనోస్థైర్యం పెంచుకోవాలి. తగాదాలు వద్దు.

కర్కాటకం

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెంచాలి. మీ తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ముఖ్యంగా స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది.

సింహం 

అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజిది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాలూ అనుకూలంగా ఉంటాయి. బంధాలు బలపడతాయి. ప్రయాణ ప్రయోజనాన్ని పొందుతారు. మనశ్శాంతిని పొందుతారు.

కన్య 

మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక పోతారు. ఫలితంగా ఇబ్బంది పడతారు. ఇచ్చిన మాటను నిలుపుకోలేక పోతారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ కనబరచాలి. అకారణ గొడవలకు ఆస్కారముంది.

తుల 

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లబ్దిని పొందుతారు. నూతన వస్తువులను కొంటారు. కీలక సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాల్య మిత్రులతో విందుకు వెళతారు.

వృశ్చికం 

కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మిత్రుల వ్యక్తిగత విషయాల్లో అతిగా జోక్యం చేసుకోకండి. బద్దకం వల్ల సమస్యలో పడతారు.

ధనుస్సు 

ఆశించిన లబ్దిని పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం 

ఆకాంక్ష నెరవేరుతుంది. ఉన్నత పదవిలోని వారి అండ లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. బంధువులతో విందులో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

కుంభం 

చిన్నపాటి పనికే అలసిపోతారు. బద్ధకం వీడి కష్టపడితేనే ఆటంకాలను దాటగలుగుతారు. పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. కీర్తి పెరుగుతుంది. గురు సమానులను కలుస్తారు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు.

మీనం 

అపార్థాలు పెరుగుతాయి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. పోటీల్లో పాల్గొనకండి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. ఆరోగ్యం జాగ్రత్త.

Tags:    

Similar News