Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (17/3/2025)
Daily Horoscope Today In Telugu, March 17, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 17, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం
తిధి: తదియ రాత్రి గం.7.33 ని.ల వరకు ఆ తర్వాత చవితి
నక్షత్రం: చిత్త మధ్యాహ్నం గం.2.47 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి
అమృతఘడియలు: ఉదయం గం.7.34 ని.ల నుంచి గం.9.23 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.9.06 ని.ల నుంచి గం.10.54 ని.ల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.39 ని.ల నుంచి గం.1.37 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.13 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.7.30 ని.ల నుంచి గం.9.00 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం.6.23 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.26 ని.లకు
మేషం
రోజు ఆనందంగా గడుస్తుంది. స్వేచ్ఛాజీవనాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనుకూలం. విందుకు హాజరవుతారు.
వృషభం
వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. కీలక విషయాల్లో బంధువులు తోడుగా నిలుస్తారు. వివాదాలు పరిస్కారం అవుతాయి. ధనలాభం ఉంది. పోయిన వస్తువు లభిస్తుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది.
మిథునం
ఇతరుల కారణంగా ఇబ్బంది పడే సూచన ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్త. సంతాన వ్యవహారాలు బాధిస్తాయి. శిక్షణ వ్యవహారాలు ఫలించవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
కర్కాటకం
స్థిరాస్తి రంగంలోని వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అశాంతి పెరుగుతుంది. జీవితానికి సంబంధించిన గుట్టు రట్టయ్యే వీలుంది. ఎవరితోనూ గొడవలకు దిగకండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.
సింహం
ధైర్యసాహసాలను కనబరుస్తారు. వ్యవహారాలను సానుకూలం అవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణనిస్తాయి. సహచరుల సహకారం లభిస్తుంది. కీలక సమాచారం అందుతుంది.
కన్య
ప్రతి ప్రయత్నానికీ ఆటంకాలు వస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. మాట తప్పడం వల్ల అవమాన పడతారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కిరావు. వేళకు భోజనం ఉండదు.
తుల
అనుకూల ఫలితాలుంటాయి. ధనలాభముంది. కీలక వ్యవహారంలో అదృష్టం తోడుంటుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. విద్యారంగంలోని వారికి మేలిమి ఫలితాలుంటాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
వృశ్చికం
వ్యవహారాల్లో నష్టపోతారు. అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. మిత్రుల సహకారం అందదు. అనవసర జోక్యాలు వద్దు. దూర ప్రయాణం ఉంది. కోర్టు విషయాల్లో జాగ్రత్త.
ధనుస్సు
అన్ని వ్యవహారాలూ అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇష్టమైన వారిని కలుస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి.కాలం ఆనందంగా సాగుతుంది.
మకరం
కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పెద్దలు, అధికారుల అభిమానాన్ని పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. గౌరవం పెరుగుతుంది. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది.
కుంభం
దూర ప్రయాణం గోచరిస్తోంది. పనులు అనుకున్నట్లుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. సంప్రదాయ జీవనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక అంశాలు స్ఫూర్తినిస్తాయి. న్యాయ సంబంధ విషయాల్లో జాగ్రత్త.
మీనం
పనులు సజావుగా సాగవు. ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. తగాదాలకు ఆస్కారం ఉంది. పోటీలలో పాల్గొనకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. బాధ్యతల నిర్వహణలో అలసత్వం వల్ల అధికారుల కోపానికి గురవుతారు.