Religion News: పెళ్లికాని అమ్మాయిలు శివలింగాన్ని తాకకూడదని చెబుతారు.. దీనికి కారణాలేంటో తెలుసా..!

Religion News: ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ విశ్వం శివలింగం నుంచి ఉద్భవించింది.

Update: 2023-12-10 01:30 GMT

Religion News: పెళ్లికాని అమ్మాయిలు శివలింగాన్ని తాకకూడదని చెబుతారు.. దీనికి కారణాలేంటో తెలుసా..!

Religion News: ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ విశ్వం శివలింగం నుంచి ఉద్భవించింది. ఈ ప్రపంచంలో ఏమీ లేనప్పుడు ఒక పెద్ద శివలింగం ఉందని, దీని కారణంగా విశ్వం మొత్తం కాంతి , శక్తితో నిండి ఉందని, ఆ తర్వాత ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయని చెబుతారు. మత గ్రంథాల ప్రకారం శివలింగాన్ని మొదట బ్రహ్మ, విష్ణు పూజించారు. వాస్తవానికి ఈ ప్రపంచంలోని ప్రతి జీవి శివుడిని ఆరాధిస్తుంది. ఎందుకంటే శివుడు ప్రతి జీవికి రక్షకుడు. అందుకే ఆయనను పశుపతినాథ్ అని పిలుస్తారు. అయితే పెళ్లి కాని యువతులు శివలింగాన్ని తాకకూడదని గ్రంథాలు, పురాణాలలో పేర్కొన్నారు.

హిందూ మతంలో శివలింగ పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శివలింగాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరువేరుతాయి. కోరుకున్న ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. పెళ్లికాని యువతులే కాకుండా, వివాహిత మహిళలు శివలింగాన్ని తాకడం వల్ల పార్వతీ దేవి ఆగ్రహానికి గురవుతారని చెబుతారు. అందుకే స్త్రీలు శివుడిని విగ్రహం రూపంలోనే పూజించాలని చెప్పారు.

స్త్రీలు శివలింగాన్ని ఎందుకు తాకకూడదు?

స్త్రీలు శివలింగాన్ని పూజించేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు. లేదంటే ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం శివలింగం శక్తికి చిహ్నం. శివలింగాన్ని పూజించ బోతున్నట్లయితే పురుషులు మాత్రమే శివలింగాన్ని తాకాలని గుర్తుంచుకోండి. పవిత్రమైన శివలింగాన్ని నేరుగా తాకడం నిషేధం. ఒక స్త్రీ తిలకం వేయడానికి శివలింగాన్ని తాకాలని అనుకుంటే ఆమె మొదట శివలింగ జలాన్ని తాకి తర్వాత శివలింగాన్ని తాకవచ్చు.

పరమశివుడు అత్యంత భక్తిపరుడు. ఎల్లవేళలా తపస్సులో నిమగ్నమై ఉంటాడు. శంకరుడిని ధ్యానిస్తున్నప్పుడు ఎవరూ కూడా ఆయన ధ్యానానికి భంగం కలిగించకూడదు. అందువల్ల యువతులు శివలింగాన్ని తాకకూడదని చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం యువతులు తల్లి పార్వతితో పాటు శివుడిని పూజించవచ్చని చెప్పారు. నిజానికి చాలా మంది అమ్మాయిలు పదహారు సోమవారాల ఉపవాసాలను పాటిస్తారు. శివుని కంటే ఆదర్శవంతమైన భర్త మరెవరూ లేరని నమ్ముతారు.

Tags:    

Similar News