Horoscope Today in Telugu 31st August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Horoscope Today in Telugu 31st August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-08-31 00:30 GMT

Horoscope Today in Telugu 31st August 2024

31-08-2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : త్రయోదశి అర్ధరాత్రి దాటాక గం.3.40 ని.ల వరకు ఆ తర్వాత చతుర్దశి

నక్షత్రం: పుష్యమి సాయంత్రం గం.7.39 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.2.31 ని.ల వరకు

వర్జ్యం: --

దుర్ముహూర్తం : ఉదయం గం.6.02 ని.ల నుంచి గం. 7.42 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.9.09 ని.ల నుంచి గం.10.43 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.02 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.30 ని.లకు

మేషం : 


భూసంబంధ లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. అవసరానికి తగ్గ డబ్బు అందుతుంది. ఆలోచన విధానం మారుతుంది. ఆత్మీయులతో విరోధం ఏర్పడుతుంది. కుటుంబంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త.

వృషభం : 


ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సహచరులకు మీ నాయకత్వంపై గురి ఏర్పడుతుంది. సోదరుల సహకరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

మిథునం : 


ఆటంకాలు పెరుగుతాయి. కార్యాల్లో జాప్యం ఏర్పడుతుంది. చరాస్తి వ్యవహారాలు లాభించవు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. కుటుంబంలో చికాకులొస్తాయి. ఇతరుల కారణంగా ఇబ్బంది పడతారు. వేళకు భోజనం ఉండదు.

కర్కాటకం:


అన్నీ అనుకున్నట్లు జరుగుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభంగా ఉ:టుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంది. బాల్యం గుర్తుకొస్తుంది.

సింహం :


 వ్యవహార నష్టం ఉంది. అన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధ చికాకులుంటాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఖర్చు చేస్తారు. వృథా ప్రయాణాలు మానుకోండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.

కన్య :


 సంతోషంగా గడుపుతారు. మనోభీష్టం నెరవేరుతుంది. మిత్రులు సహకరిస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెద్దవారితో భేటీ సత్ఫలితాన్నిస్తుంది.

తుల :


 ప్రతి ప్రయత్నమూ అనుకూల ఫలితాలనిస్తుంది. వాయిదా పడుతూ వచ్చిన పని కూడా పూర్తవుతుంది. ఆశించిన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందులో పాల్గొంటారు.

వృశ్చికం :


పనులు సవ్యంగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. గురువులను కలుస్తారు. గతాన్ని గురించిన పశ్చాత్తాపం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు :


 పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. డబ్బు సమయానికి చేతికి అందదు. మనసు కలత చెందుతుంది. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

మకరం :


 కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. విందులో పాల్గొంటారు. ప్రయాణం ఆనందాన్నిస్తుంది.

కుంభం :


రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. ప్రయత్నాల్లో శుభఫలితాలను పొందుతారు. బలహీనతలను అధిగమిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. స్వస్థానానికి చేరతారు.

మీనం :


ప్రయత్నాలేవీ అనుకూలంగా ఉండవు. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఘటనలు జరుగుతాయి. ఆర్భాటాలకు సమయం కాదు. పొట్టలో సమస్య ఉంటుంది. ఆలోచనలను అదుపు చేయండి. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. 


Full View


Tags:    

Similar News