Telugu Horoscope Today 30th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 30th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-30 00:30 GMT

Telugu Horoscope Today 30th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

30-08-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : ద్వాదశి అర్ధరాత్రి దాటాక గం.2.25 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి

నక్షత్రం: పునర్వసు సాయంత్రం గం.5.56 ని.ల వరకు ఆ తర్వాత పుష్యమి

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.24 ని.ల నుంచి గం.5.05 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.2.30 ని.ల నుంచి గం.4.13 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.22 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.42 ని.ల నుంచి గం.1.31 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.43 ని.ల నుంచి గం.12.17 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.02 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.31 ని.లకు

మేషం :


భూసంబంధ వ్యవహారాలు అనుకూలించవు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. రక్తసంబంధీకులతో విబేదాలొస్తాయి. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల సమస్యకు ఆస్కారం ఉంది.

వృషభం :


అంతటా మంచి ఫలితాలే ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పురోభివృద్ధి దిశగా కీలక సమాచారం అందుతుంది. సోదరులు సహకరిస్తారు. ప్రయాణాలు వినోదంగ సాగుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు.

మిథునం :


 అనుకున్నవి జరగవు. డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త. ఇతరుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. నిందలు భరించాల్సి వస్తుంది. కంటి సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం:


 లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభముంది. మంచి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. బంధువులతో విందులో పాల్గొంటారు. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. ఉన్నత స్థితికి ఎదగాలన్న కోరిక తీరుతుంది.

సింహం :


 అన్ని వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల అవమానాలు తప్పవు. మిత్రులతో విబేదాలొస్తాయి. వేళకు భోజనం ఉండదు. ఏకాంత ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది. ఖర్చు తగ్గించాలి.

కన్య :


 ప్రతి కార్యమూ సఫలమవుతుంది. డబ్బు ఇబ్బంది ఉండదు. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు. మిత్రులను కలుస్తారు. రోజంతా ఆనందంగా గడుస్తుంది.

తుల :


స్థిరచిత్తంతో చేసే పనులన్నీ అనుకూల ఫలితాన్నిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. గౌరవం పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవకాశాలు చేజార్చుకోకండి.

వృశ్చికం :


 పనులు అనుకున్న రీతిలో సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఉన్నత విద్యకు ఆటంకాలొస్తాయి. దూర ప్రాంత ప్రయాణం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువుల ఆశీస్సులు లభిస్తాయి.

ధనుస్సు :


 బలహీనతల వల్ల చిక్కుల్లో పడతారు. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ప్రత్యర్థులు పెరుగుతారు. పోటీల్లో ఓటమి సూచిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అజీర్తి సమస్య ఉంటుంది.

మకరం :


ఉత్సాహంగా గడుస్తుంది. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సూచన పాటించండి. ప్రయాణం లాభిస్తుంది. సుఖశాంతులు లభిస్తాయి.

కుంభం :


 కార్యజయం ఉంది. ఆదాయం మెరుగవుతుంది. బలహీనతలను జయిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

మీనం :


కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టకార్యం చెడుతుంది. ధన సంబంధ చికాకులుంటాయి. తెలివితేటలకు గుర్తింపు ఉండదు. నీచపు ఆలోచనలు చేస్తారు. అనుమానాలు వద్దు. ఆత్మధైర్యంతో సాగండి.

Tags:    

Similar News