Telugu Horoscope Today 6th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 6th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-09-06 00:30 GMT

Telugu Horoscope Today 6th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

(06-09-2024 – శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : తదియ మధ్యాహ్నం గం.3.01 ని.ల వరకు ఆ తర్వాత చవితి

నక్షత్రం: హస్త ఉదయం గం.9.25 ని.ల వరకు ఆ తర్వాత చిత్త

అమృతఘడియలు: రేపు తె.వా. గం.5.20 ని.ల నుంచి గం.7.08 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.28 ని.ల నుంచి గం.8.17 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.32 ని.ల నుంచి గం. 9.21 ని.ల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.39 ని.ల నుంచి గం. 1.29 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.41 ని.ల నుంచి గం.12.14 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.03 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.26 ని.లకు

మేషం : 


పనులు సవ్యంగా సాగుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. మిత్రులు సహకరిస్తారు. పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుంది. ధర్మమార్గంలో సాగుతారు. గౌరవం పెరుగుతుంది.

వృషభం :


 అన్ని సందర్భాల్లో సునిశితంగా వ్యవహరించాలి. ఇష్టంతో ప్రారంభించిన పని చెడిపోతుంది. నిరాశ చెందక, బద్ధకం వీడి కృషి చేయండి. సంతానంతో విభేదాలు వస్తాయి. సాటి మనుషుల తీరు వేదనకు గురి చేస్తుంది.

మిథునం :


 లక్ష్యసాధనలో.. పాత పద్ధతులు ఉపకరించవు. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. రహస్యాలను బయట పెట్టకండి. ఆర్థిక చిక్కులు, అవమానాలూ ఉంటాయి. తల్లివైపు బంధువులను కలుస్తారు. ఒత్తిడి కలుగుతుంది.

కర్కాటకం:


 అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. విలువైన సమాచారం అందుతుంది. దాయాదులతో రాజీ కుదురుతుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. బంధాలు బలపడతాయి. ప్రయాణం గోచరిస్తోంది.

సింహం :


 పనులు అనుకున్నట్లుగా సాగవు. చెప్పుడు మాటలను నమ్మడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. బ్యాంకు వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెట్టండి.

కన్య :


పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సహా అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. మీ మేధోశక్తికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. విందులో పాల్గొంటారు. కుటుంబసౌఖ్యం ఉంది. మనశ్శాంతి లభిస్తుంది.

తుల :


 ప్రయత్నాలు అంతగా ఫలించవు. అనూహ్య ఖర్చుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. బద్ధకం వద్దు. అనవసర ప్రయాణాలు మానుకోండి. వేళకు భోజనముండదు. నిద్రలేమి వేధిస్తుంది.

వృశ్చికం :


రోజంతా శుభప్రదంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లబ్దిని చేకూరుస్తాయి. ఇష్టులతో విందుకు హాజరవుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.

ధనుస్సు :


 యత్నకార్యం ఫలిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. మనశ్శాంతితో ఉంటారు.

మకరం :


 ప్రణాళికల ప్రకారం పనులు కావు. ఆత్మీయులతోనే విరోధం వస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. వృథా ఖర్చులుంటాయి. సంతానంతో విభేదిస్తారు. త్వరగా అలసిపోతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభం :


 ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం అసహనాన్ని కలిగిస్తుంది. ప్రత్యర్థులను కనిపెట్టుకుని ఉండండి. తగాదాలకు ఆస్కారముంది. దురభిప్రాయాలు ఏర్పడతయి. అధికారుల కోపానికి గురవుతారు.

మీనం :


 ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధువులను కలుస్తారు. స్వేచ్ఛాజీవితంపై ఆకాంక్ష పెరుగుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కీర్తి పెరుగుతుంది.

Tags:    

Similar News