Horoscope Today in Telugu 5th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
Horoscope Today in Telugu 5th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
(05-09-2024 – గురువారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం
తిధి : విదియ మధ్యాహ్నం గం.12.21 ని.ల వరకు ఆ తర్వాత తదియ
నక్షత్రం: ఉత్తర ఉదయం గం.6.14 ని.ల వరకు ఆ తర్వాత హస్త
అమృతఘడియలు: అర్థరాత్రి దాటాక గం.2.37 ని.ల నుంచి గం.4.26 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.3.45 ని.ల నుంచి గం.5.34 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.10.11 ని.ల నుంచి గం.11.00 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.08 ని.ల నుంచి గం.3.58 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.1.48 ని.ల నుంచి గం.3.20 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.03 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.26 ని.లకు
మేషం :
బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి. పనిలో ఒత్తిడిని జయిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పోటీల్లో అనుకూల ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత అవసరం.
వృషభం :
పనులు సవ్యంగా సాగవు. ధనసంబంధ చికాకులుంటాయి. మీ సలహాలకు విలువ ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. జూదాల్లో నష్టపోతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథునం :
కుటుంబ రహస్యాలను కాపాడాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. భూసంబంధ లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. డబ్బు సమస్య ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కర్కాటకం:
అన్ని కార్యాలూ సవ్యంగా సాగుతాయి. డబ్బు సమకూరుతుంది. సమాచార మార్పిడి సవ్యంగా సాగుతుంది. నగలు కొనే ప్రయత్నాలు చేస్తారు. ప్రింట్, మీడియా రంగంలోని వారికి అనుకూలం. మనోధైర్యం వృద్ధి చెందుతుంది.
సింహం :
భావాలను సవ్యంగా వ్యక్తం చేయలేరు. ఫలితంగా అపవాదులు వస్తాయి. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకండి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. సంపదను కోల్పోయే సూచన ఉంది.
కన్య :
ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ప్రత్యేక గుర్తింపును పొందుతారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనువైన కాలం. ఆరోగ్యం బావుంటుంది.
తుల :
అన్ని వ్యవహారాల్లోనూ నష్టం గోచరిస్తోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. బంధువులతో విరోధం గోచరిస్తోంది. అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి. అనవసర జోక్యాలు మానండి. తగాదాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం :
రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఉద్యోగులు రివార్డులను పొందే వీలుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. గృహోపకరణాలను కొంటారు.
ధనుస్సు :
మనోభీష్టం సిద్ధిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సామర్థ్యానికి తగ్గ గుర్తింపుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది.
మకరం :
పనులు సవ్యంగా సాగవు. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. భవిష్యత్తు గురించిన ప్రణాళికలు వేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కుంభం :
ప్రయత్నాలు ఫలించవు. బలహీనతలను బయటపెట్టకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ఆకస్మిక ధననష్టం ఉంది. అపోహలను తగ్గించుకోండి.
మీనం :
ఇష్టమైన పనిలో సత్ఫలితాన్ని పొందుతారు. ధనలాభం ఉంది. విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నిజాయితీకి గుర్తింపు దక్కుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.