Today Horoscope in Telugu: వారు అన‌వ‌స‌ర వివాదాల్లో త‌ల‌దూర్చితే చిక్కుల్లో ప‌డ్డ‌ట్లే.. 12 రాశుల వారి ఈరోజు రాశి ఫ‌లాలు (9 October 2024)

Today Horoscope in Telugu, 9 October 2024: ఈరోజు పంచాంగం (Panchangam) వివరాలు. 12 రాశుల వారి బుధవారం నాటి రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయంటే?

Update: 2024-10-09 00:30 GMT

Today Horoscope in Telugu, 9 October 2024

Today Horoscope in Telugu, 9 October 2024: ఈరోజు పంచాంగం (Panchangam) వివరాలు. 12 రాశుల వారి బుధవారం నాటి రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయంటే?

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: షష్ఠి ఉదయం గం. 7.24 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: మూల అర్ధరాత్రి గం.1.29 ని.ల వరకు

అమృతఘడియలు: రాత్రి గం.10.33 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.14 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.12.30 ని.ల నుంచి గం.2.11 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.34 ని.ల నుంచి గం.5.15 ని. వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.11.45 ని.ల నుంచి గం.12.31 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.03 ని.ల నుంచి గం. 1.32 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.08 ని,.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.58 ని.లకు

మేషం

పనుల పూర్తికి కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వుంటుంది. శత్రుపీడ పెరుగుతుంది. కలహాలకూ ఆస్కారం ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి.

వృషభం

బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతోనూ తగాదాలకు ఆస్కారముంది. ఉద్యోగులు, బద్ధకం కారణంగా మాట పడే పరిస్థితి ఉంది. అనుకున్న సౌకర్యాలు సమకూరవు. వారసత్వ వ్యవహారాలు అనుకూలించవు.

మిథునం

ఆకాంక్ష నెరవేరుతుంది. వ్యవహారాలన్నీ తృప్తికరంగా సాగుతాయి. బంధాలు బలపడతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. ధనలాభం ఉంది. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది.

కర్కాటకం

కార్యజయం ఉంది. బలహీనతలను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. అపోహలు, వివాదాలు తొలగుతాయి.

సింహం 

ఆటంకాలు వస్తాయి. కార్యనష్టం మనోవ్యధకు కారణం అవుతుంది. ఇతరులతో విరోధం పెరుగుతుంది. నిర్వహణ సామర్థ్యానికి గుర్తింపు లభించదు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. విలువైన వస్తువులు జాగ్రత్త.

కన్య 

ప్రతి పనికీ ఆటంకాలు వస్తాయి. ఆస్తి వ్యవహారాలు చికాకు పెడతాయి. వృథా ఖర్చులుంటాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచండి. ఆలోచన విధానాన్ని మార్చాల్సి వస్తుంది. సహాయకుల వల్ల సమస్య వస్తుంది.

తుల

పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఇరుగుపొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాం లాభిస్తుంది.

వృశ్చికం

వ్యవహారాల్లో నష్టపోతారు. ప్రతి సందర్భంలోనూ ఆచితూచి అడుగులు వేయండి. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. మాట తప్పడం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది.

ధనుస్సు 

కీలక సందర్భంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం, గౌరవం లభిస్తాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు.

మకరం

దూర ప్రయాణం గోచరిస్తోంది. డబ్బుని నష్టపోయే వీలుంది. బంధువుల చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు. బద్ధకాన్ని వదిలిపెట్టండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. వేళకు సరైన భోజనముండదు.

కుంభం 

పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కాలం ఆనందంగా సాగుతుంది.

మీనం

అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వృత్తిపర జీవితం సంతృప్తినిస్తుంది. ఉద్యోగులకు చక్కటి అవకాశాలు వస్తాయి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. విందుకు హజరవుతారు. మనశ్శాంతి లభిస్తుంది.


Full View


Tags:    

Similar News