Telugu Horoscope Today 1st October 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Telugu Horoscope Today 1st October 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి.

Update: 2024-10-01 00:30 GMT

Telugu Horoscope Today 1st October 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

01-10-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : చతుర్దశి రాత్రి గం.9.39 ని.ల వరకు ఆ తర్వాత అమావాస్య

నక్షత్రం: పుబ్బ ఉదయం గం.9.16 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక రేపు తె.వా. గం.4.15 ని.ల నుంచి ఉ.గం.6.03 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.24 ని.ల నుంచి గం.7.12 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.30 ని.ల నుంచి గం.9.18 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.53 ని.ల నుంచి గం.11.42 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.05 ని.ల నుంచి గం.4.35 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.06 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.05 ని.లకు

మేషం : 


ఇష్టమైన పని నెరవేరదు. ఆటంకాలు పెరుగుతాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు లభించదు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. సంతానం తీరు చికాకు పెడుతుంది. కలహాలకు ఆస్కారముంది. ఇతరులతో సంభాషణల్లో జాగ్రత్త.

వృషభం : 


అనుకున్న స్థాయిలో పనులు కావు. విచారం కలుగుతుంది. బంధువిరోధం గోచరిస్తోంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఒత్తిడి పెరుగుతుంది.

మిథునం :


 పనులు అనుకున్న రీతిలోనే పూర్తవుతాయి. ధనలాభం గోచరిసతోంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విందులో పాల్గొంటారు. వాహన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మనశ్శాంతి లభిస్తుంది.

కర్కాటకం:


 ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల చిక్కులు వస్తాయి. నిందలకు ఆస్కారం ఉంది. వేళకు భోజనం ఉండదు. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. వృథా ఖర్చులుంటాయి. ఆత్మీయులకూ సాయం చేయలేక పోతారు.

సింహం :


 చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. విందుకు హాజరవుతారు. గౌరవం పెరుగుతుంది. వాహన అనుభవం ఉంటుంది.

కన్య :


 పనులు సజావుగా సాగవు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. ఆత్మీయుల వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు. మనశ్శాంతి కరువవుతుంది.

తుల :


 రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఇతరుల నుంచి కావలసిన సహకారం అందుతుంది. విందుకు హాజరవుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.

వృశ్చికం :


ప్రతి ప్రయత్నంలోనూ అనుకూల ఫలితం లభిస్తుంది. అందివచ్చే అవకాశాలను ఉపయోగించుకోండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకుంటారు. విందుకు హాజరవుతారు.

ధనుస్సు :


కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. అశ్రద్ధ వల్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. విద్యారంగంలోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం :


 అడ్డంకులు ఎక్కువవుతాయి. ఆర్థిక సమస్యలుంటాయి. శత్రుపీడ పెరుగుతుంది. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. ఉద్యోగులు, పైఅధికారుల వల్ల మాట పడే వీలుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

కుంభం :


 పనులు సవ్యంగా సాగుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనుకూలం. గౌరవం పెరుగుతుంది.

మీనం :


 ఆకాంక్ష నెరవేరుతుంది. అవసరమైన డబ్బు సమకూరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలమవుతాయి. మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. విందులో పాల్గొంటారు.


Full View

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

Tags:    

Similar News