Telugu Horoscope Today 4th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 4th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-09-04 00:30 GMT

Telugu Horoscope Today 4th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

(04-09-2024 – బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : పాడ్యమి ఉదయం గం.9.46 ని.ల వరకు ఆ తర్వాత విదియ

నక్షత్రం: ఉత్తర పూర్తి

అమృతఘడియలు: రాత్రి గం.10.07 ని.ల నుంచి గం.11.55 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.17 ని.ల నుంచి మధ్యాహ్నం గం.1.06 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.50 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.40 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.15 ని.ల నుంచి గం.1.48 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.03 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.27 ని.లకు

మేషం :


 శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులను కొంటారు. గౌరవం పెరుగుతుంది. బలహీనతలను జయిస్తారు. మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది.

వృషభం : 


బద్ధకాన్ని వదిలిపెట్టాలి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. విశ్లేషణలు ఫలించవు. ముందుచూపు లేమి వల్ల చిక్కుల్లో పడతారు. అభీష్టం నెరవేరదు. విలువైన వస్తువులు జాగ్రత్త.

మిథునం :


పనిలో అడ్డంకులుంటాయి. ముఖ్యంగా గనుల రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు లాభించవు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. మానసిక ఒత్తిడి ఉంటుంది. రహస్య ప్రదేశానికి వెళతారు.

కర్కాటకం:


 ఆదాయం పెరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. అన్ని చోట్లా గౌరవాన్ని పొందుతారు. సోదర వర్గం తోడుగా ఉంటుంది. కీలక సందర్భంలో నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.

సింహం :


ఎవరికీ హామీ ఇవ్వకండి. మాట తప్పడం వల్ల అవమానం తప్పదు. మనసుకి కష్టం కలుగుతుంది. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. భావాన్ని స్పష్టంగా చెప్పలేక చిక్కుల్లో పడతారు.

కన్య :


 ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్యసాధన దిశగా సాగుతారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. తెలివితేటలు అక్కరకొస్తాయి. వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాలు ఉల్లాసంగా సాగుతాయి.

తుల :


 పనులు ఆశించినట్లుగా సాగవు. అనూహ్య ఖర్చులుంటాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. వృథా ప్రయాణాలు వద్దు. బద్ధకం వల్ల సమస్యలొస్తాయి. పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. ఒంటరితనాన్ని ఇష్టపడతారు.

వృశ్చికం :


 కాలం ఆనందంగా గడుస్తుంది. రుణ విముక్తి దిశగా ప్రయత్నాలు సాగుతాయి. మిత్రుల మూలంగా లబ్ది చేకూరుతుంది. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. ఇష్టులతో విందుకు హాజరవుతారు. సౌఖ్యాన్ని పొందుతారు.

ధనుస్సు :


 అన్నింటా అనుకూలంగా ఉంటుంది. స్థిరచిత్తంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అవసరమైన డబ్బు సమకూరుతుంది. ఉన్నతస్థానాన్ని చేరుకుంటారు. ప్రత్యర్థులను జయిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

మకరం :


 కార్యాలు అనుకున్నట్లుగా సాగవు. డబ్బు వ్యవహారాలు నెమ్మదిస్తాయి. సంతానం తీరు కోపం కలిగిస్తుంది. ఉదర సంబంధ సమస్యలుంటాయి. గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది.

కుంభం :


కాలం కష్టంగా ఉంటుంది. శత్రువుల పీడ పెరుగుతుంది. మీ బలహీనతలపై దెబ్బ కొడతారు. ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి. అపోహలను తొలగించుకోండి. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త.

మీనం :


బంధువులను కలుస్తారు. బంధాలు దృఢపడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. విందులో పాల్గొంటారు. రోజు సుఖప్రదంగా ఉంటుంది. 

Tags:    

Similar News