Horoscope Today in Telugu 3rd September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Horoscope Today in Telugu 3rd September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-09-03 00:30 GMT

Horoscope Today in Telugu 3rd September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

(03-09-2024 - మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : అమావాస్య ఉదయం గం.7.24 ని.ల వరకు ఆ తర్వాత పాడ్యమి

నక్షత్రం: పుబ్బ రేపు తె.వా. గం.3.10 ని.ల వరకు

అమృతఘడియలు: రాత్రి గం.8.01 ని.ల నుంచి గం. 9.48 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.17 ని.ల నుంచి గం.

దుర్ముహూర్తం : ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.21 ని.ల వరకు మళ్లీ రాత్రి. గం.11.06 ని.ల నుంచి గం. 11.52 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.22 ని.ల నుంచి గం. 4.55 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.03 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.28 ని.లకు

మేషం :


బద్ధకాన్ని వదిలి కష్టపడితే అనుకూల ఫలితాలుంటాయి. ఆత్రుత పనికిరాదు. కీలక నిర్ణయాల్లో మిత్రులను సంప్రదించండి. ఆలోచనలను నియంత్రించుకోండి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడతాయి. గొడవలు వద్దు.

వృషభం : 


పనులు సవ్యంగా సాగవు. డబ్బుకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాహన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి. ఒత్తిడి పెరుగుతుంది. రక్తసంబంధీకులతో గొడవలు వస్తాయి. సేవాసంస్థలకు అనుకూలం కాదు.

మిథునం : 


అన్నింటా మంచే జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొంటారు. బోళాతనం వల్ల చిక్కులొస్తాయి. ప్రయాణాలకు అనుకూలం. మిత్రులు తోడుంటారు. సహచరుల వల్ల లబ్దిని పొందుతారు.

కర్కాటకం:


విరోధాలకు ఆస్కారం ఉంది. నోటి దురుసును తగ్గించాలి. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత చెడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం :


 ఉల్లాసంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. జీవనోపాధి మెరుగుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. సౌకర్యాలు మెరుగవుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. మనో ధైర్యం పెరుగుతుంది.

కన్య :


 ఇతరులతో వ్యవహారాలు జాగ్రత్త. గుడ్డిగా నమ్మితే ఇబ్బందుల్లో పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. ప్రయాణం గోచరిస్తోంది. పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. వేళకు భోజనముండదు. బంధువిరోధం ఉంది.

తుల :


 కార్యాలు శుభప్రదంగా పూర్తవుతాయి. అభీష్టం నెరేవరుతంది. అవసరమైన డబ్బుఅందుతుంది. ఇష్టులను కలుస్తారు. శాఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. మనశ్శాంతి లభిస్తుంది.

వృశ్చికం :


 పనుల్లో విజయం లభిస్తుంది. మేలిమి అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభ కాలం. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

ధనుస్సు :


 ఆశించిన స్థాయిలో పనులు జరగవు. మనసు కలతకు గురవుతుంది. విద్యారంగానికి చెందిన వారు అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతల నిర్వహణలో తడబాట్లు ఉంటాయి. పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది.

మకరం :


 శ్రమ అధికంగా ఉంటుంది. డబ్బు సకాలంలో చేతికి అందదు. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఉద్రేకాన్ని తగ్గించాలి. బలహీనతల వల్ల నష్టపోతారు. పరిశోధనలు ముందుకు సాగవు. ప్రత్యర్థుల పీడ పెరుగుతుంది.

కుంభం :


 అందరితోనూ సత్సంబంధాలుంటాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామి సహకరిస్తుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.

మీనం :


 అపోహలు తొలగిపోతాయి. కార్యాలు విజయవంతం అవుతాయి. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. బలహీనతలను అధిగమిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

Tags:    

Similar News