Telugu Horoscope Today 2nd september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 2nd september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-09-02 00:30 GMT

Telugu Horoscope Today 2nd september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

02-09-2024 (సోమవారం)

లాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : అమావాస్య పూర్తి

నక్షత్రం: మఖ అర్ధరాత్రి గం.12.20 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ

అమృతఘడియలు: రాత్రి గం.9.41 ని.ల నుంచి గం.11.27 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.04 ని.ల నుంచి గం.12.50 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం. 12.40 ని.ల నుంచి గం. 1.30 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.10 ని.ల నుంచి గం.3.59 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.36 ని.ల నుంచి గం.9.09 ని,.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.02 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.29 ని.లకు

మేషం :


అడుగడుగునా ఆటంకాలుంటాయి. ధన సంబంధ చిక్కులొస్తాయి. మనోధైర్యాన్ని కోల్పోకండి. బద్ధకం వదిలి కష్టపడండి. విశ్లేషణలు ఫలించవు. కీలక నిర్ణయాలను వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం :


ప్రతి పనిలో అడ్డంకులుంటాయి. ఆర్థిక నష్టాలు వేధిస్తాయి. గుట్టుగా ఉండే పరిస్థితిని సూచిస్తోంది. విద్యకు భంగం ఏర్పడుతుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం :


 శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక వనరులు వృద్ధి చెందుతాయి. సహచరులు అండగా నిలుస్తారు. వృత్తికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ప్రయాణం ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణను కలిగిస్తాయి.

కర్కాటకం:


 పనుల్లో జాప్యం ఉంటుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఇతరుల కారణంగా ఇబ్బందులు వస్తాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తుంది. మాటకు విలువ తగ్గుతుంది.

సింహం :


అన్ని వేళల్లో అదృష్టం తోడుగా ఉంటుంది. చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వాహనయోగం ఉంది.

కన్య :


 అనూహ్య ఖర్చులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. బంధువులతో సఖ్యత చెడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

తుల :


ఆశించిన ఫలితాలుంటాయి. ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. సేవలో సంతృప్తిని పొందుతారు. పెద్దవారిని కలుస్తారు. పరిచయాలు బలపడతాయి.

వృశ్చికం :


అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగుతాయి. అవకాశాలు చేజార్చకండి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అధికారుల మన్ననలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు :


వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. మిత్రులతో విభేదాలు గోచరిస్తున్నాయి. త్వరగా అలసి పోతారు. సంప్రదాయిక జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం :


 నిర్దిష్ట సమయంలో పనులు కావు. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. తోటివారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. బలహీనతల వల్ల ఇబ్బందిలో పడతారు. తగాదాలకు దూరంగా ఉండండి.

కుంభం :


 కార్యాలన్నీ ఫలిస్తాయి. ధన వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి.

మీనం :


కార్యజయం ఉంది. ధనలాభం ఉంది. వివాదాలు తొలగిపోతాయి. ఆనందం పెరుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంది. బంధువులు సహకరిస్తారు. కీర్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనంతో మనశ్శాంతిని పొందుతారు.

Tags:    

Similar News