Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/10/24)

Today Horoscope in Telugu, 12 October 2024: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. 12 రాశుల వారి శనివారం నాటి రాశిఫలాలు మీకోసం..

Update: 2024-10-12 00:30 GMT

Today Horoscope in Telugu, 12 October 2024: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. 12 రాశుల వారి శనివారం నాటి రాశిఫలాలు మీకోసం..

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: దశమి రేపు తె.వా. గం.4.11 ని.ల వరకు

నక్షత్రం: శ్రవణం అర్ధరాత్రి గం.12.45 ని.ల వరకు

అమృతఘడియలు: సాయంత్రం గం.6.28 ని.ల నుంచి గం.8.01 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.15 ని.ల నుంచి గం.10.48 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.09 ని.ల నుంచి గం.7.43 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.05 ని.ల నుంచి గం.10.34 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.09 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.56 ని.లకు

మేషం 

అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మనశ్శాంతితో ఉంటారు. పోటీల్లో గెలుపు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడుపుతారు.

వృషభం 

సంప్రదాయ బద్ధమైన జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం తీరు కాస్తంత చికాకు పెట్టినా, పరిస్థితిని చక్కదిద్దుతారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం 

నిరాశ చెందకుండా కష్ట పడితే కార్యాలు సఫలం అవుతాయి. తోటివారిపై దురభిప్రాయాలను వదిలిపెట్టండి. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. పోటీల్లో ప్రత్యర్థులదే పైచేయిగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

కర్కాటకం

బంధుమిత్రులను కలుస్తారు. రోజంతా ఉల్లాసంగా సాగుతుంది. ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది. మీ దృష్టికి వచ్చే కొత్త విషయాలను భవిష్యత్తుకు అనువుగా మలచుకుంటారు. కుటుంబంలో సందడి ఉంటుంది.

సింహం 

అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. అపార్థాలు తొలగుతాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొంటారు. గౌరవం పెరుగుతుంది. పోటీలు గెలుస్తారు.

కన్య 

సున్నిత అంశాలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆకాంక్ష నెరవేరదు. ఆలోచనలు వక్రమార్గం పట్టకుండా నియంత్రించుకోవాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల 

అంతరంగానికి సంబంధించిన కోరికను నెరవేర్చుకుంటారు. ధన సమస్యల పరిష్కారానికి మిత్రులు సహకరిస్తారు. బుద్ధి నిలకడగా ఉండదు. మిమ్మల్ని సమర్థించేవారే వ్యతిరేకంగా వ్యవహరించడం బాధిస్తుంది.

వృశ్చికం 

అన్నివైపులా మంచే జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలను సాధించుకుంటారు. బంధువులు తోడుగా నిలుస్తారు. విందులో పాల్గొంటారు. ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు 

ఆర్థిక వ్యవహారాలను ఇవాళ్టికి వాయిదా వేయడం మంచిది. నోటి దురుసుతనం కారణంగా గొడవలు వచ్చే వీలుంది. మీ మనసులోని భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయలేక ఇబ్బంది పడతారు. కంటి సమస్య ఉంటుంది.

మకరం 

అదృస్టం అండగా నిలుస్తుంది. పనులు చకచకా పూర్తవుతాయి. ఎదుగుదలకు ఆత్మీయులు అండగా నిలుస్తారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. తెలివితేటలకు తగ్గ గుర్తింపు ఉంటుంది.

కుంభం 

అనూహ్యమైన ఖర్చులు వస్తాయి. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. మనసును నిగ్రహించుకోవడం ద్వారా కీలక సమస్య పరిష్కారమవుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బద్ధకం వదిలిపెట్టండి.

మీనం 

ఉల్లాసంగా గడుపుతారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఆనందాన్ని పొందుతారు. విందుకు హాజరవుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.


Tags:    

Similar News