Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 19 July 2024
Today Horoscope in Telugu, 19 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 19 శుక్రవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu, 19 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 19 శుక్రవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం.
తిధి: త్రయోదశి రాత్రి గం.7.41 ని.ల వరకు ఆ తర్వాత చతుర్దశి.
నక్షత్రం: మూల ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.2.55 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాషాఢ.
అమృతఘడియలు: రాత్రి గం.8.39 ని.ల నుంచి గం.10.13 ని.ల వరకు.
వర్జ్యం: ఉదయం గం.11.15 ని.ల నుంచి గం.12.49 ని.ల వరకు తిరిగి అర్ధరాత్రి దాటాక గం.1.21 ని.ల నుంచి గం.2.55 ని.ల వరకు.
దుర్ముహూర్తం: ఉదయం గం.08.28 ని.ల నుంచి గం.9.20 ని.ల వరకు తిరిగి మధ్యాహ్నం గం.12.49 ని.ల నుంచి గం. 1.41 ని.ల వరకు.
రాహుకాలం: ఉదయం గం. 10.45 ని.ల నుంచి గం.12.22 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం.5.51 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం.6.53 ని.లకు.
మేషం
కార్య సాధనకు బాగా శ్రమించాల్సి వుంటుంది. సంతానం తీరు కలవర పరుస్తుంది. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణముంది. ఉద్యోగులు మాట పడాల్సి వస్తుంది. ఖర్చులు తగ్గించాలి.
వృషభం
చెప్పుడు మాటలు నమ్మి అపోహలు పెంచుకుంటారు. అయినవారినే అనుమానిస్తారు. స్వల్ప తగాదాలూ ఉంటాయి. ఉద్యోగుల ప్రవర్తన అధికారుల కోపానికి కారణమవుతుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి.
మిథునం
ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. పరిజ్ఞానానికి పదును పెడతారు. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు మనోబలాన్ని పెంచుతుంది. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి.
కర్కాటకం
చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. అన్ని ప్రయత్నాల్లో శుభ ఫలితాలను పొందుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొంటారు. కీర్తి వృద్ధి చెందుతుంది.
సింహం
ఆటంకాలు ఎదురవుతాయి. అభీష్ట సాధనకు బాగా శ్రమించాలి. మేధస్సుకు పదును పెట్టాలి. నీచపు ఆలోచనలను నియంత్రించాలి. గొడవలకు దూరంగా ఉండండి. కీలక డాక్యుమెంట్లు, వస్తువులు జాగ్రత్త.
కన్య
సంతాన సంబంధ ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. దుర్వ్యసనాల వల్ల సమస్యలుంటాయి. ప్రయత్నలోపం లేకున్నా పనులు సవ్యంగా సాగవు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
తుల
పనులన్నీ అనుకూలమవుతాయి. ఆత్మవిశ్వాసంతో కృషి చేసి కార్యాలను సాధించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలకు ప్రశంసలొస్తాయి. మిత్రులు తోడుంటారు.
వృశ్చికం
అకారణ విరోధం గోచరిస్తోంది. ఆచితూచి వ్యవహరించండి. మాట తప్పడం వల్ల నిందలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. కంటి సమస్యను అశ్రద్ధ చేయకండి.
ధనుస్సు
పనులు అనుకున్నట్లుగానే పూర్తవుతాయి. అంతులేని ఆనందాన్ని పొందుతారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త బాధ్యత స్వీకరిస్తారు. మనశ్శాంతిని పొందుతారు.
మకరం
ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బంధువులతో జాగ్రత్త. అనూహ్య ఖర్చులుంటాయి. అప్పు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు మానండి. బద్ధకం వదలాలి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
కుంభం
ఆనందంగా గడుపుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో లాభముంటుంది. ఇతరుల తోడ్పాటు కూడా లభిస్తుంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు.
మీనం
మేలిమి అవకాశం అందివస్తుంది. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శత్రు పీడ తొలగిపోతుంది. గొడవలు సద్దుమణుగుతాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది.