Chandra Grahan 2024: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున వస్తోంది.. ఈ రాశుల వారికి ఎఫెక్ట్..!
Chandra Grahan 2024: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున సంభవిస్తోంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయి.
Chandra Grahan 2024: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున సంభవిస్తోంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని రాశులవారికి శుభాలు మరికొన్నిరాశులకు అశుభ ఫలితాలు ఉంటాయి. ప్రాచీన గ్రంథాల ప్రకారం చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. మొదటి చంద్రగ్రహణం మార్చి 25న సంభవిస్తుంది. అయితే ఏ సమయంలో ఏర్పడుతుందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
చంద్రగ్రహణం సమయం ఎప్పుడు..?
హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25, సోమవారం ఏర్పడుతుంది. ఇది ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.20 గంటల వరకు కొనసాగుతుంది. వాస్తవానికి చంద్రగ్రహణం భారతదేశంపై ప్రభావం చూపదు. హోలీ పండుగపై ఎలాంటి ప్రభావం ఉండదు. పండుగను ఎలాంటి ఇబ్బంది లేకుండా రంగులతో జరుపుకోవచ్చు. చంద్రగ్రహణం అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, సౌత్ నార్వే, స్విట్జర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
చంద్రగ్రహణం వల్ల ఏ రాశులపై ప్రభావం ?
ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం అన్ని రాశిచక్రాలను ప్రభావితం చేస్తోంది. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం జెమిని, సింహం, మకరం, ధనుస్సు రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక ఈ రోజు ఆలయాలు దాదాపు మూసి ఉంటాయి. గ్రహణ సమయం మగిసిన తర్వాత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు.