Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (25/10/2024)

Telugu Horoscope Today, October 25, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-10-25 00:30 GMT

Telugu Horoscope Today, October 25, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: నవమి రేపు తె.వా. గం.3.22 ని.ల వరకు ఆ తర్వాత దశమి.

నక్షత్రం: పుష్యమి ఉదయం గం.7.40 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష.

అమృతఘడియలు: లేవు.

వర్జ్యం: రాత్రి గం.9.35 ని.ల నుంచి గం.11.19 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.31 ని.ల నుంచి గం.9.18 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.23 ని.ల నుంచి గం.1.10 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.10.33 ని.ల నుంచి గం. 12.00 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.12 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.48 ని.లకు.

మేషం 

పనులు సవ్యంగా సాగవు. ఆటంకాలను దాటాల్సి వుంటుంది. వృథా ఖర్చుల వల్ల చేబదుళ్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. బంధువులతో విరోధం, అవమానాలు గోచరిస్తున్నాయి.

వృషభం 

ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల దిశగా ఆలోచించండి. సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ఆత్మధైర్యం పెరుగుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది.

మిథునం 

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. ఇతరుల వల్ల ఇబ్బందులు గోచరిస్తున్నాయి. చర్చల్లో ఆచితూచి మాట్లాడండి. తొందరపాటు వల్ల ఆస్తి నష్టపోయే సూచన ఉంది. సరైన భోజనముండదు. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

అన్ని రంగాల్లోని వారికీ అనుకూల ఫలితాలుంటాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. కుటుంబ పరిస్థితులు తృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. అమితానందాన్ని పొందుతారు.

సింహం 

ప్రయత్నాలు అంతగా కలిసిరావు. అభీష్టం నెరవేరే సూచన లేదు. డబ్బుకి కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. బద్ధకాన్ని వదిలితే మంచిది.

కన్య 

కార్యాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవహారాలన్నీ లాభదాయకంగా సాగుతాయి. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. అవసరమైన వేళ ఇతరులూ సహకరిస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి.

తుల 

అభీష్టం నెరవేరుతుంది. ప్రతి ప్రయత్నమూ అనుకూల ఫలితాలనిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. బంధువులను కలుస్తారు. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు.

వృశ్చికం 

కలహాలకు ఆస్కారముంది. ఇతరుల వ్యవహారాల్లో ఆచితూచి నడచుకోండి. ఉద్యోగులు పైఅధికారుల కోపానికి గురయ్యే వీలుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. కడుపునకు సంబంధించిన సమస్య ఉంటుంది.

ధనుస్సు 

నిర్ణీత సమయానికి పనులు కావు. చెప్పుడు మాటలను వినడం వల్ల అపోహలు పెరుగుతాయి. ఉద్యోగులు, తమ నిర్లక్ష్యం కారణంగా మాట పడాల్సి వస్తుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి.

మకరం 

వ్యవహారాలన్నింటా విజయం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. సహచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం సుఖకరంగా ఉంటుంది. జీవితభాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.

కుంభం 

శుభ ఫలితాలుంటాయి. బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభంగా సాగుతాయి. కీర్తి పెరుగుతుంది. స్వస్థానప్రాప్తి ఉంది.

మీనం 

బద్ధకానికి దూరంగా ఉండాలి. బాగా శ్రమిస్తేనే అభీష్టం నెరవేరుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. తెలివి తేటలకు గుర్తింపుండదు. వాత సంబంధ సమస్యలుంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచండి.

Tags:    

Similar News