Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (October 23, 2024)

Telugu Horoscope Today, October 23, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-10-23 00:30 GMT

Telugu Horoscope Today, October 23, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం

తిధి: సప్తమి అర్ధరాత్రి దాటిన తర్వాత గం.1.18 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: పునర్వసు పూర్తి

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.48 ని.ల నుంచి తె.వా. గం.5.26 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.57 ని.ల నుంచి గం.7.35 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.11.37 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.24 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.27 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.11 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.49 ని.లకు

మేషం 

ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పనులు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృషభం 

విడాకులు లేదా రెండో పెళ్లికి చేసే ప్రయత్నాలు అనుకూలించవు. విరోధాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఇతరుల వల్ల కుటుంబంలో చికాకులొస్తాయి. అనుకున్నవి జరగవు. అశాంతి పెరుగుతుంది.

మిథునం 

పనులు అనుకున్నట్లే జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బాల్యస్నేహితులతో విందుకు హాజరవుతారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలుంటాయి. కుటుంబంపై శ్రద్ధ పెడతారు.

కర్కాటకం

వ్యవహారాల్లో నష్టపోయే సూచన ఉంది. ప్రతి పనినీ ఆచితూచి చేయాలి. శత్రుపీడ ఎక్కువవుతుంది. అనూహ్య ఖర్చు, తొందరపాటు నిర్ణయం వల్ల ధననష్టం గోచరిస్తున్నాయి. అనవసర జోక్యాలు మానుకోండి.

సింహం 

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఇతరుల నుంచీ సహకారం లభిస్తుంది. మానసిక శాంతిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

కన్య 

అన్ని రంగాల్లోని వారికీ యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబానికి సంబంధించిన అభీష్టం నెరవేరుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తుల 

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. త్వరగా అలసిపోతారు. మనశ్శాంతి కూడా కరువవుతుంది. పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దైవ చింతన పెరుగుతుంది.

వృశ్చికం 

పనులు సవ్యంగా సాగవు. ఇతరులపై అపోహలు పెరుగుతాయి. ధన సంబంధ వ్యవహారాలూ బెడిసికొడతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తగాదాలకు ఆస్కారముంది. పైత్య సంబంధ సమస్య ఉంటుంది.

ధనుస్సు 

ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. ఆర్థిక లబ్దిని పొందుతారు. ఇతరులతో బంధాలు బలపడతాయి. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత వృద్ధి చెందుతుంది.

మకరం 

పనులు సవ్యంగా సాగుతాయి. డబ్బుకి సంబంధించిన చిక్కులు తొలగిపోతాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది.

కుంభం 

వ్యవహారాల్లో ఆటంకాలు పెరుగుతాయి. ధన సంబంధ చికాకులుంటాయి. లావాదేవీల్లో జాగ్రత్త. అభీష్టం నెరవేరే సూచన లేదు. వాత సంబంధ సమస్య ఇబ్బంది పెడుతుంది. అనవసర జోక్యాల వల్ల విరోధం వస్తుంది.

మీనం 

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. అవమానాలు ఎదురవుతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే గొడవలు వస్తాయి. వృథా ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

Tags:    

Similar News