Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (October 19, 2024)

Telugu Horoscope Today, October 19, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Update: 2024-10-19 00:30 GMT

Telugu Horoscope Today

Telugu Horoscope Today, October 19, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షినాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: విదియ ఉదయం గం.9.48 ని.ల వరకు ఆ తర్వాత తదియ.

నక్షత్రం: భరణి ఉదయం గం.10.46 ని.ల వరకు ఆ తర్వాత కృత్తిక.

అమృతఘడియలు: ఉదయం గం.6.30 ని.ల నుంచి గం.7.56 ని.ల వరకు.

వర్జ్యం: రాత్రి గం.9.39 ని.ల నుంచి గం.11.06 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.6.10 ని.ల నుంచి గం.7.44 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.9.06 ని.ల నుంచి గం. 10.33 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.10 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం.5.52 ని.లకు.

మేషం 

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది.

వృషభం 

బద్ధకం వల్ల సమస్యల్లో పడతారు. అనూహ్యమైన ఖర్చులుంటాయి. బంధువులు విరోధులుగా మారతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దూరప్రయాణం ఉంది.

మిథునం 

అభీష్టం నెరవేరుతుంది. శుభకార్యం నిర్వహిస్తారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. ఆధాయం పెరుగుతుంది. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి.

కర్కాటకం

ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. అన్ని పనుల్లోనూ అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లబ్ది ఉంటుంది.

సింహం 

అశాంతికి కారణమయ్యే బలహీనతలను జయించాల్సివుంటుంది. పనుల పూర్తికి బాగా కష్టపడాలి. దూర ప్రయాణముంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానం తీరు చికాకుపెడుతుంది. కోపాన్ని తగ్గించుకోవాలి.

కన్య 

పనులు అనుకున్నట్లుగా సాగవు. అడ్డంకులను దాటాల్సి వుంటుంది. అపోహలు, దురాలోచనలు పెరుగుతాయి. వేళకు భోజనం ఉండదు. తగాదాలకు ఆస్కారం ఉంది. పోటీలలో ఆశించిన ఫలితం లభించదు.

తుల 

బంధువులను కలుస్తారు. సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల లబ్ది కలుగుతుంది.

వృశ్చికం 

సర్వత్రా శుభప్రదంగా ఉంటుంది. కార్యదక్షతకు తగ్గ ఫలితం ఉంటుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మిత్రుల తోడ్పాటూ లభిస్తుంది. పోటీలలో విజయం సాధిస్తారు. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు.

ధనుస్సు 

సంతాన సంబంధ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. అభీష్టం నెరవేరే సూచన లేదు. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల తగాదాలు పెరిగే సూచనలు ఉన్నాయి.

మకరం 

చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సఫలం కావు. కార్యనష్టానికి తోడు అవమానాలూ వేధిస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అయినవారితోనే విరోధం వస్తుంది. ఆస్తి సంబంధ వివాదం విచారాన్ని కలిగిస్తుంది.

కుంభం 

చేపట్టిన కార్యాలు ఆశించినరీతిలోనే సఫలం అవుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు సహచరులు తోడుంటారు. కీలక సమాచారం తృప్తినిస్తుంది.

మీనం

ఆటంకాల వల్ల పనులు అనుకున్నట్లుగా సాగవు. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలోనూ చికాకులు పెరుగుతాయి. రెండో పెళ్లి ప్రయత్నాలు సఫలం కావు.


Full View


Tags:    

Similar News