Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...(October 17, 2024)
Telugu Horoscope Today, October 17, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, October 17, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షినాయనం, శరదృతువు, శుక్ల పక్షం
తిధి: పౌర్ణమి సాయంత్రం గం.4.55 ని.ల వరకు ఆ తర్వాత కృష్ణ పాడ్యమి
నక్షత్రం: రేవతి సాయంత్రం గం.4.20 ని.ల వరకు ఆ తర్వాత అశ్వని
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.14 ని.ల నుంచి గం.3.38 ని.ల వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉదయం గం.10.04 ని.ల నుంచి 10.51 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.45 ని.ల నుంచి గం. 3.32 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.1.29 ని.ల నుంచి గం.2.57 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.10 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 5.53 ని.లకు
మేషం
పనులు అంత సవ్యంగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనూహ్యమైన ఖర్చులు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
వృషభం
వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. సంతాన సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. ఆరోగ్యం బావుంటుంది. కాలం ఆనందంగా సాగుతుంది.
మిథునం
ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో విందుకు వెళతారు. గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం
పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అడ్డంకుల్ని దాటాల్సి వుంటుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. న్యాయ మార్గాన్ని అనుసరిస్తారు.
సింహం
పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఆందోళనను కలిగిస్తాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వేళకు భోజనముండదు. అజీర్తి సమస్య ఉంటుంది.
కన్య
కోరిక నెరవేరుతుంది. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. కొత్త విషయాలను గ్రహిస్తారు. బంధాలు దృఢపడతాయి. ప్రయాణం లాభిస్తుంది. నిజాయితీకి తగ్గ గుర్తింపు ఉంటుంది. మిత్రులతో విందుకు వెళతారు.
తుల
వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిత్రుల సహకారంతో కీలక వివాదాన్ని పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
వృశ్చికం
పనులకు ఆటంకాలు వస్తుంటాయి. బద్ధకం వీడి కష్టించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సూచనలను పాటించండి. ప్రేమ వ్యవహారాలు అంత సజావుగా సాగవు. విలువైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరచండి.
ధనుస్సు
విద్య, సేవా సంస్థల వారు జాగ్రత్తగా ఉండాలి. అపవాదులకు ఆస్కారం ఉంది. ఆస్తి క్రయవిక్రయాలు లాభించవు. ఇంటి వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. మనసు నిలకడ లోపిస్తుంది.
మకరం
ఆదాయం మెరుగవుతుంది. పనులు ఆశించిన రీతిలోనే పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. కీలక సమాచారం సంతోష పెడుతుంది.
కుంభం
బ్యాంకు లావాదేవీలు చికాకు పెడతాయి. ఇతరుల వల్ల సమస్యలొస్తాయి. అకారణ విరోధాలుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనం ఉండదు. వ్యవహార నష్టం ఆందోళనకు కారణమవుతుంది.
మీనం
అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. మనశ్శాంతిని పొందుతారు. అదృష్టం తోడుంటుంది.