Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు..ఆ రాశులవారికి ఈ రోజు అన్ని ప్రతికూల ఫలితాలే (October 16, 2024)
Telugu Horoscope Today, October 16, 2024: నేటి రాశి ఫలాలు..ఆ రాశులవారికి ఈ రోజు అన్ని ప్రతికూల ఫలితాలే.
Telugu Horoscope Today, October 16, 2024: నేటి రాశి ఫలాలు.. నేటి రాశి ఫలాలు..ఆ రాశులవారికి ఈ రోజు అన్ని ప్రతికూల ఫలితాలే.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం.
తిధి: చతుర్దశి రాత్రి గం.8.40 ని.ల వరకు.
నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి గం.7.18 ని.ల వరకు ఆ తర్వాత రేవతి.
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.04 ని.ల నుంచి గం.4.28 ని.ల వరకు.
వర్జ్యం: ఉదయం గం.6.36 ని.ల నుంచి గం.8.01 ని.ల వరకు మళ్లీ రేపు తె.వా.గం.5.49 ని.ల నుంచి గం.7.13 ని.ల వరకు.
దుర్ముహూర్తం: ఉదయం గం.11.38 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.25 ని.ల వరకు.
రాహుకాలం: మధ్యాహ్నం గం.12.01 ని.ల నుంచి గం.1.29 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం. 6.09 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం. 5.54 ని.లకు.
మేషం
పనులు అంత సవ్యంగా సాగవు. సమస్యలు పెరగకుండా తెలివిగా ప్రవర్తించాలి. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. వేళకు భోజనం ఉండదు. ఏ విషయంలోనైనా మితిమీరిన జోక్యం వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త.
వృషభం
కార్యజయం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనశ్శాంతి లభిస్తుంది.
మిథునం
కీలక సమయంలో మీ నైపుణ్యం ఉపకరిస్తుంది. మేలిమి అవకాశం అందివస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా ఉంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
కర్కాటకం
పనులకు ఆటంకాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. పెద్దల ఆశీస్సులను పొందుతారు.
సింహం
చెప్పుడు మాటలు వినడం వల్ల అపోహలు పెరుగుతాయి. ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి. తగాదాలకు ఆస్కారం ఉంది. పోటీల్లో ఆశించిన ఫలితముండదు. ప్రత్యర్థులు బలపడతారు. అజీర్తి సమస్యలు ఉంటాయి.
కన్య
వ్యవహారాలన్నీ సఫలమవుతాయి. బంధువులను కలుస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. సంతాన సంబంధ తృప్తిని పొందుతారు.
తుల
ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. కోర్టు వ్యవహారం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.
వృశ్చికం
అభీష్టం నెరవేరే సూచన లేదు. బద్ధకాన్ని వదిలించుకోవాలి. అనవసర జోక్యం వల్ల సమస్యలు వస్తాయి. వృథా ఖర్చులుంటాయి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. తెలివితేటలు అక్కరకు రావు. ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు
ఆలోచనలు సవ్యంగా సాగవు. రహస్య వ్యవహారాల వల్ల ఇబ్బందులొస్తాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తి లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన సంబంధ సమస్యలుంటాయి.
మకరం
కీలక సందర్భంలో సహచరులు తోడుగా నిలుస్తారు. ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. నాయకత్వ పటిమతో సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తిగానే ఉంటాయి. మానసిక సౌఖ్యం లభిస్తుంది.
కుంభం
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ హామీగా ఉండకండి. నిందలు భరించాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. వృథా ఖర్చు ఆవేదనను కలిగిస్తుంది.
మీనం
కీలక సందర్భంలో మీ తెలివితేటలు రాణిస్తాయి. మనొస్థైర్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందులో పాల్గొంటారు. బాల్యమిత్రులను కలుస్తారు. కీర్తి పెరుగుతుంది.