Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ధనలబ్ధి..కొత్త పనులు చేపడతారు (October 15, 2024)
Telugu Horoscope Today, October 15, 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ధనలబ్ధి..కొత్త పనులు చేపడతారు.
Telugu Horoscope Today, October 15, 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ధనలబ్ధి..కొత్త పనులు చేపడతారు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం
తిధి: త్రయోదశి అర్ధరాత్రి గం.12.19 ని.ల వరకు
నక్షత్రం: పూర్వాభాద్ర రాత్రి 10.08 ని.ల వరకు
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.4.26 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.6.26 ని.ల నుంచి గం.7.51 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.30 ని.ల నుంచి గం. 9.17 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.48 ని.ల నుంచి గం.11.37 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.2.58 ని.ల నుంచి గం.4.26 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.09 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 5.54 ని.లకు
మేషం
పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. ఆశించిన ఆర్థిక లబ్ది చేకూరుతుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సేవారంగంపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.
వృషభం
అభీష్టం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వృత్తి నిపుణుతలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.
మిథునం
పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. బాధ్యత నుంచి తప్పుకోరాదు. పెద్దల సూచనలు అవసరం అవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం గోచరిస్తోంది.
కర్కాటకం
కార్యసాధనలో కాస్త కష్టపడాల్సి వుంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల ఆత్మీయులపైనే అపోహలు పెరుగుతాయి. ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి. ఆకస్మిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త.
సింహం
బంధాలు బలపడతాయి. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. బంధువులతో విందుకు హాజరవుతారు. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది.. భాగస్వామ్య వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు.
కన్య
బలహీనతలను అధిగమిస్తారు. పనులన్నింటా విజయం సాధిస్తారు. మిత్రులు, సహచరుల తోడ్పాటు లభిస్తుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. మనశ్శాంతిని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల
బద్ధకాన్ని వదిలి చిత్తశుద్ధితో పనిచేయాలి. నిరాశ, అనుమానాలను వదిలి కృషి చేయండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. కీలక నిర్ణయాల్లో స్నేహితుల సూచనలు మేలు చేస్తాయి. జీర్ణ సమస్యలుంటాయి.
వృశ్చికం
బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో విరోధం ఏర్పడుతుంది. పనులు సవ్యంగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వాహన సంబంధ వ్యవహారాలు చిక్కుల్లో పడేస్తాయి.
ధనుస్సు
శుభ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. సోదరులు తోడుగా నిలుస్తారు. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యముంది.
మకరం
తొందరపడి హామీలు ఇవ్వకండి. నిందల పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. కంటి సమస్యలుంటాయి.
కుంభం
పనులు చకచకా పూర్తవుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉత్సాహంగా గడుపుతారు. వ్యక్తగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాహన యోగం ఉంది. నిరుద్యోగులను అదృష్టం వరిస్తుంది.
మీనం
పనులు సవ్యంగా సాగవు. బద్దకాన్ని వదలి పెట్టాలి. ఆర్థిక లావాదేవీలల్లో జాగ్రత్త. వైద్య ఖర్చులుంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. నిద్రలేమి వేధిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. ఏకాంతంగా గడుపుతారు.