Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 6 July 2024
Today Horoscope in Telugu 6th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 6 శనివారంనాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu 6th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 6 శనివారంనాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం
తిధి: పాడ్యమి రేపు తె.వా.గం. 4.26 ని.ల వరకు తర్వాత విదియ
నక్షత్రం: పునర్వసు రేపు తె.వా.గం.4.48 ని.ల వరకు ఆ తర్వాత పుష్యమి
అమృతఘడియలు: రేపు తె.వా.గం.2.20 ని.ల నుంచి గం.3.58 ని.ల వరకు
వర్జ్యం: సాయంత్రం గం.4.27 ని.ల నుంచి గం.6.06 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.5.47 ని.ల నుంచి గం.7.32 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.9.04 ని.ల నుంచి గం.10.43 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా.గం.5.47 ని.ల కు
సూర్యాస్తమయం: సా. గం.6.55 ని.ల కు
మేషం
ఆటంకాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గిస్తే మేలు. బుద్ధి నిలకడగా ఉండదు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త.
వృషభం
ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. అగ్రిమెంట్లకు అనుకూలం. మిత్రుల సహకారం తీసుకోండి.
మిథునం
తొందరపాటుతో చిక్కుల్లో పడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినివ్వవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది.
కర్కాటకం
ప్రతి రంగంలోని వారికీ యోగదాయకంగా గడుస్తుంది. గృహావసరాలు తీరుస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు.
సింహం
పనుల్లో జాప్యం ఉంటుంది. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసరపు వ్యర్థ ప్రయాణాలు మానండి. మిత్రవిరోధం గోచరిస్తోంది. మనసు కలతబారుతుంది. బద్ధకాన్ని వదిలాలి.
కన్య
ప్రయత్నాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఇష్టమైన వారితో వినోదాల్లో పాల్గొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఇతరులు సహకరిస్తారు. మనశ్శాంతిని పొందుతారు. రుణ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.
తుల
పనులు సవ్యంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. ఇతరుల వల్ల తలెత్తే చిక్కుల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.
వృశ్చికం
కార్యసాధనలో త్వరగా అలసిపోతారు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. సంతానం తీరు ఆందోళనను కలిగిస్తుంది. దూరప్రయాణాలుంటాయి. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో అతిజాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు
అప్రమత్తంగా ఉండాలి. తప్పు నిర్ణయాలతో అధికారులు, పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. జీర్ణ సమస్యలుంటాయి.
మకరం
సంతృప్తిగా ఉంటారు. కీలక వ్యవహారం కొలిక్కి వస్తుంది. మధ్యవర్తిత్వం ఫలిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి.
కుంభం
ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. తల్లి సోదరునితో బంధం బలపడుతోంది. భాగస్వామ్య వ్యవహారాల్లో వ్యక్తిగత లాభాన్ని పొందుతారు. కొత్త వస్తువులు కొంటారు. శత్రుపీడ తగ్గుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.
మీనం
స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకండి. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. సంయమనం అవసరం. ఇతరుల వల్ల ఇబ్బంది పడే సూచన ఉంది. బద్ధకాన్ని వీడి పనిచేస్తే ఆటంకాలను దాటేయడం తేలిక.