Libra Horoscope 2024: తులా రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు..!
ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో తులారాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
Libra Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్స రం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవణం చేయాలి. ఈ సంవత్సరం జాతకంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, కర్నము, వారం ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో తులారాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఆదాయం : 2
వ్యయం : 8
రాజపూజ్యం : 1
అవమానం : 5
అదృష్టసంఖ్య 6
ఉత్తర 2,3,4 పాదములు; హస్త 1,2,3,4 పాదములు; చిత్త 1, 2 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, రా, పే, పో
క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయంలో రైతులకు నష్టం రాకుండా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు సామాన్యమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. లాయర్లు, డాక్టర్లు జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టర్లు జాగ్రత్తగా టెండర్లు వేయాలి. రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు తప్పవు. వెండి, బంగారం వ్యాపారులకు అధిక ఆదాయం సమకూరుతుంది.
ఏ వ్యాపారంలో ఉన్నవారైనా మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తేనే నష్టాలు రాకుండా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రుల అభినందనలు ఉంటాయి. ప్రతి విషయం ఎంతో కష్టంగా ఉన్నా కార్యదీక్షకు భంగం కలిగించినా భగవంతుని దయతో కొంత ఆలస్యంగా పనులు సాధిస్తారు. ఎవ్వరికీ ఉచిత సలహాలు ఇవ్వొద్దు. ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
పరిపూర్ణ విశ్వాసంతో కార్యదీక్ష కలిగి ఎవరితో ఏ విధంగా అనేది చాకచక్యంగా మసలుకొంటే ఈ సంవత్సరం అంతా ఎదురీతగా ఉంటుంది. సినిమా వారికి అనుకూలత లేదు. నిరుద్యోగులకు వ్యతిరేకతలు ఉన్నవి. విద్యార్థులు పట్టుదలతో చదవాలి. ప్రతిరోజు నిత్య పారాయణ శరవణ భవన అనే నామం జపం చేయాలి. చిత్త నక్షత్రం వాళ్లు పగడం ధరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు, తీర్థయాత్రలు చేయాలి.
స్వాతి నక్షత్రం వాళ్లు గోమేదికం ధరించాలి. దుర్గాదేవికి ఆరాధన చేయడం వల్ల అభివృద్ధి కనిపిస్తుంది. కుంకుమ పూజలు, అష్టోత్తర సహస్ర నామాలు చేయాలి. విశాఖ నక్షత్రం వాళ్లు కనక పుష్యరాగం ధరించాలి. దక్షిణామూర్తికి, సాయిబాబాకు పూజలు చేసి శెనగల గుగ్గిళ్లు, ప్రసాదములుగా పంచాలి. మహన్యాస రుద్రాభిషేకం, జలాభిషేకం చేయించడం వల్ల మానసిక సమస్యలు, ఒత్తిడినుంచి బయటపడుతారు. మీరు ఎవరికి హామీ ఉన్నా తప్పక అప్పులు కట్టవలసి పరిస్థితులు వస్తాయి. శత్రు బాధలకు గురవుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అందుకే ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.