Capricorn Horoscope 2024: మకరరాశివారికి మంచి ఎంత.. చెడు ఎంత..?

Capricorn Horoscope 2024:ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు.

Update: 2024-04-08 11:30 GMT

Capricorn Horoscope 2024: మకరరాశివారికి మంచి ఎంత.. చెడు ఎంత..?

Capricorn Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవ‌ణం చేయాలి. ఈ సంవ‌త్సరం జాత‌కంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, క‌ర్నము, వారం ఇలా అన్ని విష‌యాలు తెలుసుకోవాలి. ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో మకర రాశివారికి మంచి ఎంత చెడు ఎంత తెలుసుకుందాం.

ఆదాయం : 14

వ్యయం : 14

రాజపూజ్యం : 3

అవమానం : 1

అదృష్టసంఖ్య 8

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ

క్రోధినామ సంవత్సరం మకర రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని తెలియని ఆటంకాలు ఎదురవుతుంటాయి. రైతులకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. లాయర్లు, డాక్టర్లకు కలిసొస్తుంది కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిల్వధనం ఖర్చవుతుంది. కాంట్రాక్టర్లు, రాజకీయాల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. వెండి బంగారం వాళ్లకి అనుకూలంగా ఉంటుంది.టింబర్, సిమెంట్, స్టీల్ వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంది కానీ ధనం నిలవదు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ వాళ్లకి సామాన్యంగా ఉంటుంది.

వృత్తి, వ్యాపారులకు రాబడి, ఖర్చు రెండు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు బాగుంటుంది కానీ ఏసీబీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగుల కు సామాన్యం. సరస్వతి తల్లిని ఆరాధించని విద్యార్థులకు మార్కులు తగ్గిపోతాయి. సినిమా రంగం వాళ్లకి గతం కన్నా ఆదాయం బాగుంటుంది. భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో ధనవ్యయం చేస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఉంటాయి. తొందరపాటు తనంతో ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి.

మాట అదుపులో పెట్టుకుంటే గొడవలు దరిరావు. కోర్టు గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించే వాళ్లకి ఆకస్మిక ధనరాబడి. వస్తు, వాహన యోగం. స్థలములు, ప్లాట్ ఏదో ఒకటి సమకూర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు. చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. సమయానికి భోజనం చేసి, ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించాలి. సూర్య ఆరాధన చేయాలి. శ్రవణ నక్షత్రం వాళ్లు దుర్గాదేవికి పూజలు, అష్టోత్తర సహస్ర నామాలు చేయాలి. ధనిష్ట నక్షత్రం వాళ్లు జాతి పగడం ధరించాలి. ప్రతి మంగళవారం 450 గ్రా. కందులు నానపెట్టి గోవుకు తినిపించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయడం ఉత్తమం.

Tags:    

Similar News