Solar Eclipse 2023: సూర్యగ్రహణం వల్ల ఈ 2 రాశులవారికి అశుభం.. జాగ్రత్తగా ఉండాలి..!
Solar Eclipse 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఏడాదిలో చివరి సూర్యగ్రహణం వస్తోంది.
Solar Eclipse 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఏడాదిలో చివరి సూర్యగ్రహణం వస్తోంది. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య రోజు వస్తున్నందున చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్టోబర్ 14, 2023న సంభవించే సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను అందిస్తోంది. కాబట్టి ఆయా రాశుల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. వారి గురించి తెలుసుకుందాం.
సూర్యగ్రహణం ప్రభావం
జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహణాన్ని ఒక అశుభకరమైన ఘటనగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ 14వ తేదీ అమావాస్య రోజున ఈ గ్రహణం రాత్రి 8:34 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం 2 రాశుల వారికి మంచిది కాదు. ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
సింహ రాశి వారికి ఏడాదిలో వచ్చే రెండో సూర్యగ్రహణం మంచిదికాదని చెప్పాలి. ఈ వ్యక్తుల జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. కొన్ని చెడ్డ వార్తలు వినాల్సి ఉంటుంది. మానసిక సమస్యలు, ఒత్తిడి పెరుగుతుంది. గౌరవం, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. జీవితంలో ఒకేసారి అనేక సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారంలో పెద్ద నష్టాలు వస్తాయి.
కన్య రాశి
అక్టోబర్ 14న ఏర్పడే సూర్యగ్రహణం కన్యా రాశి వారికి అశుభ ఫలితాలను అందిస్తుంది. అందుకే ఈ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా పెద్ద సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. కెరీర్‌లో సమస్యలు ఏర్పడుతాయి. ఆఫీసులో ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. పనిలో ఫెయిల్యూర్ సంభవిస్తుంది.