Astro News: గ్రహాలను బట్టి దుస్తులు ధరించండి.. ఆత్మవిశ్వాసం, అదృష్టం రెండు కలిసివస్తాయి..!
Astro News: ప్రతిరోజు మనం ఇష్టమొచ్చిన విధంగా బట్టలు వేసుకుంటాం. ఒక పద్దతి అంటూ ఏది ఉండదు. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ డ్రెస్ వేసుకుంటాం.
Astro News: ప్రతిరోజు మనం ఇష్టమొచ్చిన విధంగా బట్టలు వేసుకుంటాం. ఒక పద్దతి అంటూ ఏది ఉండదు. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ డ్రెస్ వేసుకుంటాం. అయితే జ్యోతిష్యం ప్రకారం గ్రహాలను బట్టి దుస్తులు ధరించడం వల్ల పాజిటివ్ ఫలితాలతో పాటు అదృష్టం కలిసివస్తుందని నమ్మకం. ప్రతి రోజుకు గ్రహాన్ని బట్టి ఒక రంగు ఉంటుంది. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో ఈ రోజు తెలుసుకుందాం.
1. ఆదివారం - పింక్ లేదా లేత ఎరుపు
ఆదివారానికి సూర్యుడు అధిపతి. ఈ రోజున గులాబీ, లేత ఎరుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. దీనివల్ల శక్తి, విశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. అయితే ఈ రోజున పొరపాటున కూడా నల్లని దుస్తులు ధరించకూడదు.
2. సోమవారం - తెలుపు
సోమవారానికి అధిపతి చంద్రుడు. ఈయన శాంతికి చిహ్నం. ఈ రోజున తెల్లని దుస్తులు ధరించడం వల్ల మానసిక స్వచ్ఛత, భావోద్వేగ సమతుల్యత, శాంతి అనుభూతి కలుగుతుంది. ఇది కోపాన్ని నియంత్రిస్తుంది ఏకాగ్రతను సృష్టిస్తుంది.
3. మంగళవారం - ఆరెంజ్ లేదా మెరూన్
మంగళవారానికి అధిపతి మార్స్. ఈయన ధైర్యం, శక్తిని అందిస్తాడు. ఈ రోజున నారింజ లేదా మెరూన్ దుస్తులను ధరించడం వల్ల ఉత్సాహం, సంకల్పం, వేగం పెరుగుతుంది. ఇది సవాళ్లను ఎదుర్కోవడానికి సాయపడుతుంది.
4. బుధవారం - ఆకుపచ్చ
బుధవారానికి అధిపతి బుధుడు. ఈయన తెలివితేటలు, కమ్యూనికేషన్‌కు చిహ్నం. ఈ రోజున ఆకుపచ్చని దుస్తులను ధరించడం వల్ల మానసిక చురుకుదనం పెరుగుతుంది. స్పష్టమైన కమ్యూనికేషన్‌తో పాటు వ్యక్తులతో సత్సంబంధాలపై దృష్టి పెడుతారు. సంబంధాలు, ప్రయత్నాలలో విజయం వరిస్తుంది.
5. గురువారం - పసుపు
గురువారానికి అధిపతి గురుడు. ఈయనను సంతోషం, డెవలప్‌మెంట్‌కు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున పసుపు బట్టలు ధరిస్తే అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. అవకాశాలకు కల్పిస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి.
6. శుక్రవారం - తెలుపు లేదా లేత నీలం
శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఈయన ప్రేమ, అందం, సృజనాత్మకతకు ప్రతీక. ఈ రోజున తెలుపు లేదా లేత నీలం పట్టు (శాటిన్) బట్టలు ధరించడం వల్ల ఆకర్షణ, చక్కదనం, కళాత్మక వ్యక్తీకరణ పెరుగుతుంది.
7. శనివారం - నీలం
శనివారానికి అధిపతి శనిదేవుడు. ఈయన క్రమశిక్షణ, స్థిరత్వాన్ని సూచిస్తాడు. ఈ రోజున నీలిరంగు దుస్తులను ధరించడం వల్ల దృష్టి, సంకల్పం, స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తుంది. జీవితంలో స్థిరంగా ఎదగడానికి సాయపడుతుంది.