Friday Mistakes: శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది..!

Friday Mistakes: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు కొన్ని వస్తువులు కొనవద్దు.. అలాగే కొన్ని పనులు చేయవద్దు.. దీనివల్ల ఇంట్లోకి దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతారు.

Update: 2023-09-15 12:30 GMT

Friday Mistakes: శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది..!

Friday Mistakes: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు కొన్ని వస్తువులు కొనవద్దు.. అలాగే కొన్ని పనులు చేయవద్దు.. దీనివల్ల ఇంట్లోకి దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే శుక్రవారం సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవి రోజు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున కొన్ని వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎలాంటి వస్తువులని నివారించాలో ఈ రోజు తెలుసుకుందాం.

జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం ఎలాంటి డబ్బు లావాదేవీలు చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవి కోపగించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. శుక్రవారం రోజున ఎలాంటి వంటగది వస్తువులు కొనకూడదు. పూజ సమయంలో అవసరమయ్యే వస్తువులు కూడా కొనకూడదు. జ్యోతిష్యం ప్రకారం భూమి లేదా ఆస్తికి సంబంధించిన పనులు శుక్రవారం చేయకూడదు. ఈ పనులు చేస్తే నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పురాణ గ్రంథాల ప్రకారం శుక్రవారం చక్కెరతో జాగ్రత్తగా ఉండాలి. తెల్లటి వస్తువులు శుక్ర గ్రహానికి సంబంధించినవిగా చెబుతారు. దీనివల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా మారుతుంది.

ఈ వస్తువులు శుభప్రదం

సంగీతం, అలంకరణ, అందం, కళలకు సంబంధించిన వస్తువులను శుక్రవారం కొనుగోలు చేయడం శ్రేయస్కరం. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. అయితే శుక్రవారం సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఈ రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో మానసిక ఉద్రిక్తత ఏర్పడుతుంది. గొడవలు జరుగుతాయి. దీనివల్ల కుటుంబం రోడ్డున పడుతుంది.

Note: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘hmtv’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. 

Tags:    

Similar News