Religion News: మహిళలకు అలర్ట్‌.. ఈ మాసంలో తులసిని పూజిస్తున్నారా..!

Religion News: హిందూ మతం ప్రకారం ఈ మాసం పక్షం రోజులు ముగిసిన తర్వాత ఖర్మ రోజులు ప్రారంభమవుతాయి.

Update: 2023-12-15 13:00 GMT

Religion News: మహిళలకు అలర్ట్‌.. ఈ మాసంలో తులసిని పూజిస్తున్నారా..!

Religion News: హిందూ మతం ప్రకారం ఈ మాసం పక్షం రోజులు ముగిసిన తర్వాత ఖర్మ రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజుల్లో వివాహం, గృహప్రవేశం, ఇతర శుభ కార్యాలు నిర్వహించకూడదు. ఖర్మ రోజులలో ఈ పనులు చేయడం మంచిది కాదు. అలాగే హిందూ మతం ప్రకారం తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. ప్రతి ఇంటిలో ఈ మొక్కని పూజిస్తారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుందని నమ్మకం. అయితే తులసి మొక్కను పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

ఖర్మ రోజులలో చాలామంది తులసిని పూజించరు. అయితే శుభకార్యాలు చేయకూడదు గానీ తులసి చెట్టును పూజించడంపై ఎలాంటి ఆంక్షలు లేవు. నిజానికి ఖర్మలలో గ్రహాలు శాంతించాలంటే మతపరమైన పూజలు ఎక్కువ ఏకాగ్రతతో చేయాలి. ఖర్మమాసంలో తులసిని తప్పనిసరిగా పూజించాలి. ఇది గ్రహాలను శాంతింపజేయడమే కాకుండా నెగిటివిని తొలగించడంలో ఉపయోగపడుతుంది. శాస్త్రాల ప్రకారం ఖర్మ రోజులలో తులసిని పూజించడం ద్వారా విష్ణువు ప్రసన్నుడవుతాడు. ఇది గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది.

అయితే ఈ నియమాలను గుర్తుంచుకోండి. ఈ మాసంలో తులసిని పూజించాలి కానీ ముట్టుకోకూడదు. తులసి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. అందుకే ప్రతి ఇంటిలో ఈ చెట్టు ఉంటుంది. ప్రతిరోజు మహిళలు ఈ చెట్టును పూజించడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది. అదృష్టం కలిసివస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే తులసిని నియమాల అనుసారం పూజించాలి. అప్పుడే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.

Tags:    

Similar News