Shop Vastu Tips: మీ షాప్‌కి తక్కువ కస్టమర్లు వస్తున్నారా.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే లాభాల్లో ఉంటారు..!

Shop Vastu Tips: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు మానేసి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తు న్నారు.

Update: 2024-04-06 12:15 GMT

Shop Vastu Tips: మీ షాప్‌కి తక్కువ కస్టమర్లు వస్తున్నారా.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే లాభాల్లో ఉంటారు..!

Shop Vastu Tips: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు మానేసి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తు న్నారు. అయితే ఎంత ఉత్సాహంగా వ్యాపారం మొదలుపెడుతున్నారో అంతే వేగంగా క్లోజ్‌ చేస్తున్నారు. దీనికి కారణం షాప్‌ మెయింటనెన్స్‌ తెలియకపోవడం కొంత అయితే వాస్తు దోశాలు గుర్తించకపోవడం మరొక కారణం. ఎవరైనా సరే ఒక వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే లాభాలు రావు దానికోసం కొంతకాలం వెయిట్ చేయాలి. అలాగే షాప్‌ వాస్తు ప్రకారం ఉందా లేదా గమనించాలి. ఈ రోజు షాప్‌కి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం దుకాణం ప్రధాన ద్వారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. దీనిని బట్టే కస్టమర్లు దుకాణానికి వస్తారు. లక్ష్మీ దేవి కూడా ఈ తలుపు నుంచి మాత్రమే మీ షాప్‌లోకి వస్తుంది. కాబట్టి దుకాణం ప్రధాన తలుపు సరైన దిశలో ఉండటం అవసరం. దుకాణం తూర్పు ముఖంగా ఉంటే అప్పుడు ప్రధాన తలుపు తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి. ప్రధాన తలుపు తూర్పు దిశ మధ్యలో వరకు విస్తరించవచ్చు. దుకాణం దక్షిణ దిశలో ఉంటే ప్రధాన తలుపు దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ కోణంలో ఉండాలి.

మెయిన్ డోర్ ను ఎప్పుడూ శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచాలని గుర్తుంచుకోండి. కాలానుగుణంగా శుభ్రం చేయాలి. దుకాణం ప్రధాన ద్వారం మురికి కాలువ, బురద పక్కన ఉండకూడదు. దుకాణం ప్రధాన ద్వారం ముందు స్తంభం లేదా ప్రకటన బోర్డు లేదా పొడవైన వేలాడే విద్యుత్ తీగలు ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం దుకాణం ప్రధాన తలుపు ఎల్లప్పుడూ లోపలికి ఓపెన్ అయి ఉండాలి. దీంతో ఆ దుకాణంలో లక్ష్మీదేవి కొలువై ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. దుకాణం ప్రధాన తలుపు ఇరుకైనదిగా కాకుండా వెడల్పుగా తెరిచి ఉండాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News