Vastu Plants: వాస్తు ప్రకారం ఈ 3 మొక్కలు ఇంట్లో ఉంటే శుభం.. సంపద వర్షం కురుస్తుంది..!

Vastu Plants: హిందూ మతంలో కొన్ని మొక్కలు చాలా పవిత్రమైనవి. ఒక వ్యక్తి ఇంట్లో ఈ మొక్కలను నాటితే అక్కడ ఆనందం,అభివృద్ది, లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తాయని నమ్మకం.

Update: 2023-11-14 11:37 GMT

Vastu Plants: వాస్తు ప్రకారం ఈ 3 మొక్కలు ఇంట్లో ఉంటే శుభం.. సంపద వర్షం కురుస్తుంది..!

Vastu Plants: హిందూ మతంలో కొన్ని మొక్కలు చాలా పవిత్రమైనవి. ఒక వ్యక్తి ఇంట్లో ఈ మొక్కలను నాటితే అక్కడ ఆనందం,అభివృద్ది, లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తాయని నమ్మకం. హిందూ మతంలో అద్భుతమైన దైవిక లక్షణాలతో కూడిన కొన్ని మొక్కలు ఉన్నాయి. వీటిని ఇంటి ఆవరణలో నాటినప్పుడు చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య ఉన్నా, కష్టపడినా ఫలితం లేకున్నా, తదితర కుటుంబ సమస్యల వంటివి పూర్తిగా తొలగిపోతాయి. అలాంటి 3 మొక్కల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తులసి మొక్క

తులసి మొక్కను లక్ష్మిదేవికి చిహ్నంగా భావిస్తారు. ఒక వ్యక్తి ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అతడిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. మంగళవారం, ఆదివారం తులసి మొక్కను తాకకూడదని గుర్తుంచుకోండి.

రావి మొక్క

డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యను తొలగించడంలో రావిచెట్టు సహాయపడుతుంది. రావి మొక్కను బహిరంగ ప్రదేశంలో లేదా గుడి దగ్గర నాటాలి. శనివారం సాయంత్రం చెట్టుకు నీరు నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

షమీ మొక్క

తులసితో పాటు శమీ మొక్క ఇంట్లో ఉంటే అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని హిందూ మతస్తుల నమ్మకం. నిజానికి షమీని శనిదేవుని చిహ్నంగా భావిస్తారు. కావున దీన్ని ఇంట్లో నాటడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. శమీ మొక్కను పూజించడం వల్ల శని దేవుడి అనుగ్రహం, తల్లి లక్ష్మిదేవి కటాక్షం లభిస్తాయని నమ్ముతారు.

Tags:    

Similar News