Vastu Tips: వాస్తు ప్రకారం రాత్రిపూట ఈ పనులు చేస్తే అశుభ ఫలితాలు..!

Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన శాస్త్రం. దీని ప్రకారం కొన్ని పనులు ఏ సమయాల్లో చేయాలో అదే సమయంలో చేయాలి. లేదంటే పాజిటివ్‌కు బదులు నెగిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.

Update: 2024-01-05 14:30 GMT

Vastu Tips: వాస్తు ప్రకారం రాత్రిపూట ఈ పనులు చేస్తే అశుభ ఫలితాలు..!

Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన శాస్త్రం. దీని ప్రకారం కొన్ని పనులు ఏ సమయాల్లో చేయాలో అదే సమయంలో చేయాలి. లేదంటే పాజిటివ్‌కు బదులు నెగిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. దీంతో జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేటి రోజుల్లో సమయం ఉండకపోవడం వల్ల ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పనులు చేసుకుంటున్నారు. రాత్రిపూట లేదా సూర్యాస్తమయం తర్వాత చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వేగంగా పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి రాత్రిపూట ఏ పనులు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

గోర్లు కత్తిరించడం: రాత్రిపూట జుట్టు, గోర్లు కత్తిరించడం నిషేధం. రాత్రిపూట ఈ పనులు చేయడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. దీనితో పాటు గ్రంథాలలో మంగళ, గురు, శనివారాల్లో జుట్టు లేదా గోళ్లను కత్తిరించడం అశుభకరమైనదిగా చెప్పారు.

శుభ్రపరచడం: ఇంటిని శుభ్రం చేయడానికి సమయం ఉంటుంది. వాస్తు ప్రకారం రాత్రిపూట లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

దానం: రాత్రిపూట పొరపాటున దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత పసుపు, నూనె, పాలు-పెరుగు మొదలైన వాటిని ఎవ్వరికీ ఇవ్వకూడదు.

బట్టలు ఉతకడం: రాత్రిపూట బట్టలు ఉతకడం, ఎండబెట్టడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వేగంగా వస్తుంది. ఇంటి వెలుపల బట్టలు ఆరబెట్టడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వాటిలోకి ప్రవేశిస్తుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో బట్టలు ఉతకడం అంత మంచిది కాదు.

Tags:    

Similar News