Vasthu Tips: పసుపుతో చేసే ఈ నివారణలు డబ్బుతో ముడిపడి ఉంటాయి.. అవేంటంటే..?

Vasthu Tips: పసుపు సంపదకు చిహ్నం. హిందూ మంతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ శుభకార్యం చేసినా పసుపును వాడుతారు.

Update: 2024-02-24 14:00 GMT

Vasthu Tips: పసుపుతో చేసే ఈ నివారణలు డబ్బుతో ముడిపడి ఉంటాయి.. అవేంటంటే..?

Vasthu Tips: పసుపు సంపదకు చిహ్నం. హిందూ మంతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ శుభకార్యం చేసినా పసుపును వాడుతారు. పసుపు పాజిటివ్‌ శక్తని ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. పసుపు సంపద ఆకర్షించడంలో సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు ముద్దను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే వాస్తు ప్రకారం పసుపును ఏ విధంగా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.

వంటగదిలో పసుపు

వాస్తు ప్రకారం ఇంటి వంటగదిలో పసుపును ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు డబ్బాను ఉంచడం వల్ల సంపదను ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎల్లప్పుడు ఆనందం ఉంటుంది. అందుకే చాలామంది హిందువులు పసుపుతో ఇంటిగడపను అలంకరిస్తారు. ఇంటి పూజ గదిలో పసుపును ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది.

డబ్బు రాకను పెంచడానికి డబ్బు దాచుకునే చోట పసుపు ముద్దను ఉంచాలి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. ఒక వ్యక్తి తన పర్సులో పసుపు ప్యాకెట్‌ను ఉంచుకుంటే అతనికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఇది డబ్బును ఆకర్షించడంలో సహాయపడుతుంది. తద్వారా పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఇదే కాకుండా పసుపును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతారు. ఇది అనేక వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ పసుపు ఉండే విధంగా చూసుకోవాలి.

Tags:    

Similar News