Do Not Eat Food On Bed: మంచంపై కూర్చొని అన్నం తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు..!
Do Not Eat Food On Bed: జ్యోతిష్యం ప్రకారం ఆహారం ఒక పద్దతిగా తినాలి. కానీ చాలామంది ఇంట్లో తెలియకుండా ఇష్టమొచ్చినట్లుగా తింటారు.
Do Not Eat Food On Bed: జ్యోతిష్యం ప్రకారం ఆహారం ఒక పద్దతిగా తినాలి. కానీ చాలామంది ఇంట్లో తెలియకుండా ఇష్టమొచ్చినట్లుగా తింటారు. దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాస్తవానికి ఇంట్లోని బెడ్‌పై పడుకుంటాం కానీ ఆహారం తినడానికి ఉపయోగించవద్దు. ఇది చాలా చెడ్డ అలవాటు. కానీ చాలామంది బెడ్‌పై కూర్చొని అన్నం తింటారు. దీనివల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. దీనివల్ల కుటుంబంలో గొడవలు మొదలవుతాయి.
మంచం మీద తినడం
బెడ్ అంటే కేవలం పడుకోవడానికి మాత్రమే. మరే ఇతర పని దానిపై చేయకూడదు. పిల్లలు మంచం మీద కూర్చొని చదువుకున్నట్లు, పెద్దలు కూడా మంచంపై కూర్చొని తమ పనిని చేస్తారు. కొంతమంది మంచం మీద కూర్చొని ఆహారం కూడా తింటారు. ప్రజలు తమ పనులన్నీ మంచం మీద చేయడం మంచి పద్దతి కాదు. ఆహారం తినడం వల్ల కడుపు నిండడమే కాకుండా పోషక విలువలున్న పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. అయితే మంచం మీద కూర్చొని ఆహారం తినడం వల్ల ఆ ఆహారం పోషకాహారంగా మారదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచం మీద కూర్చొని ఆహారం తినవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తి మంచం మీద కూర్చొని టీ లేదా నీరు కూడా తాగకూడదు.
లక్ష్మీదేవికి కోపం వస్తుంది
పడకగదిలో భోజనం చేస్తే సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో స్థలం కొరతగాఉంటే వంటగదిలో తివాచీ వేసుకొని ఆహారం తీసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ లేనట్లయితే స్టడీ టేబుల్ లేదా సోఫాలో కూర్చొని ఆహారం తినవచ్చు. స్టడీ టేబుల్‌పై లేదా సోఫా టేబుల్‌పై ప్లేట్‌ను ఉంచుకుని ఆహారం తీసుకుంటే ఆ టేబుల్‌ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి.