Tulasi Puja: తులసి చెట్టు ప్రతి రోజు ఇలా పూజ చేయండి.. ధనవృద్ధి లభిస్తుంది..!
Tulasi Puja: హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసిని నిత్యం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి.
Tulasi Puja: హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసిని నిత్యం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి. శాస్త్రాల ప్రకారం శ్రీ హరికి తులసి అంటే చాలా ఇష్టం.. ఇది లేనిదే ఆయన ఆహారం కూడా స్వీకరించడు. తులసిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు.
సాయంత్రం పూట తులసి మొక్కకు హారతి ఇవ్వాలి. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఇంట్లోకి ఆనందం, సంతోషం వస్తాయి. ఇది మాత్రమే కాదు వ్యక్తి జీవితంలోని అన్ని దుఃఖాలు, కష్టాలు, వ్యాధులు తొలగిపోతాయి. మీరు తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించాలి. పూజ సమయంలో తులసీ చాలీసా పఠిస్తే శుభాలు కలుగుతాయి. ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు ఎప్పుడూ ఎండిపోకుండా ఉండాలి.
ప్రతిరోజు తులసికి పూజ చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాధులు ఉన్న వారు రిలాక్స్ అవుతారు. ఇంట్లోకి అపారమైన సంపద వస్తుంది. పిల్లలకు ఉద్యోగాలు, పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సంతాన ప్రాప్తి లభిస్తుంది. ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.