Varahi Yatra: పవన్ వారాహి యాత్ర.. మళ్లీ ఎప్పుడు..?

Varahi Yatra: ఎలాంటి టార్గెట్‌తో పవన్ ముందుకెళతారు..?

Update: 2023-09-02 14:30 GMT

Varahi Yatra: పవన్ వారాహి యాత్ర.. మళ్లీ ఎప్పుడు..?

Varahi Yatra: మూడు విడ‌త‌లు వారాహి యాత్ర పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ కేడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి గోదావ‌రి జిల్లాలు టార్గెట్‌గా ప‌వ‌న్ త‌న మొదటి యాత్ర ప్రారంభించారు. అంద‌రూ ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే ప‌వ‌న్ జోరు కొన‌సాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? మూడు విడతల విజయ యాత్ర ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. నాలుగో విడత యాత్రకు సుదీర్ఘ గ్యాప్ ఎందుకు తీసుకున్నారనే అంశంపైనే అందరి దృష్టి ఉంది.

ఇప్పటికే మూడు విడతలు వారాహి యాత్ర ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు పవన్... అంతే కాదు వారాహి టూర్ ద్వారా జనసేన పార్టీ గ్రాఫ్ కూడా కాస్త పెరిగిందని తెలుస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకు మంచి పట్టుంది. సామాజిక సమీకరణాల ప్రకారం కూడా ఈ జిల్లాలో పార్టీకి మంచి కేడర్ ఉంది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. అదే ఊపుతో రెండో విడత యాత్ర కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చేశారు పవన్ కళ్యాణ్. మూడో విడత యాత్రను ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగించారు.

నాలుగో విడత వారాహి యాత్రను ఈనెలాఖరులో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట జనసేనాని... అయితే ఈసారి యాత్రను ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరపాలని కొంతమంది నేతలు కోరుతున్నప్పటికీ.. కృష్ణా లేదా గుంటూరు జిల్లాలో ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారట... వీలైతే ఈసారి రూటు మార్చి కృష్ణా లేదా గుంటూరు జిల్లాలో యాత్ర జరపడం ద్వారా అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని కూడా ఆలోచనలో ఉన్నారట.

ఒక్కో విడత వారాహి యాత్రలో ప్రభుత్వంపై పలురకాలుగా విమర్శల దాడి చేశారు జనసేనాని. ప్రభుత్వంపై విమర్శలు పెంచడం ద్వారా పార్టీకి మంచి మైలేజీ వస్తుందని అంచనా వేస్తున్నారు.... అందుకే నాలుగో విడత యాత్రకు అదే రకంగా ముందుకెళ్లేలా జనసేన అధినేత కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కొంచెం ఆలస్యంగా అయినా నాలుగో విడత యాత్ర ప్రారంభించి.. ఎన్నికలు సమీపించే వరకు 100 రోజుల పాటు 100 సభలు నిర్వహించి.. వాటిల్లో ప్రభుత్వంపై, ఇతర పార్టీలపై విమర్శలు సంధించడంలో పదును పెంచేలా ప్రణా‎ళిక రచించి ముందుకెళ్లనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చి నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టాలని జనసేనాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తాను సినిమాల్లో బిజీగా ఉంటే.. పార్టీ రాజకీయంగా వెనుకబడే అవకాశం ఉందని, అందుకే నాలుగో విడత యాత్రను విజయనగరం జిల్లా నుంచి ప్రారంభించి.. ఓట్లర్లను ఆకర్షించేలా యాత్ర కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయంగా మైలేజీ వచ్చే అంశాలపైనే జనసేనాని ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.. తన యాత్ర ద్వారా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోన్న పవన్... నాలుగో విడత యాత్రలో మరింత దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ అందిపుచ్చుకున్న పవన్

మొత్తానికి పవన్ వారాహి యాత్ర ఎప్పుడు ఉంటుంది...? ఎలాంటి టార్గెట్‌తో పవన్ ముందుకు వెళ్తారనేది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News