Violence in AP Tourism office: మాస్క్ ధరించాలని చెప్పినందుకు సహోద్యోగిని చావబాదాడు!
Violence in AP Tourism office: ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు సహోద్యోగిని చవబాదాడా ప్రబుద్ధుడు!
Violence in AP Tourism office: ధికార మదం.. ఆమె పై దాడికి దిగింది. మంచి చెబితే చెడు ఎదురవడం అంటే ఏమిటో ఆ మహిళకు అర్థం అయింది. అసలే కరోనా కారణంగా అందరూ వణికిపోతున్నారు. సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించడం తప్పనిసరి. చదువుకొని వారే.. బయటకు వెళ్ళినా మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో అదీ ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తీ మస్స్క్ పెట్టుకోకుండా విధులు నిర్వహిస్తున్డటమే కాకుండా మాస్క్ ధరించండి అని చెప్పినందుకు ఆమెను చావ బాదాడు ఆ అధికారి. వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ మహిళ ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రాడ్ తో దాడి చేశారు. మాస్కు లేకుండా డిప్యూటీ మేనేజర్ భాస్కర్ అకౌంటెంట్ తో మాట్లాడుతున్న సమయంలో మహిళా ఉద్యోగి ఉషారాణి మాస్క్ పెట్టుకోవాలిని సూచించింది. మాస్క్ పెట్టుకుని మాట్లాడాలని చెప్పిన మహిళా ఉద్యోగిపై ఆగ్రహంతో డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మరణాయుధాలతో దాడి చేశాడు.
సహచర ఉద్యోగులు కలుగజేసుకొని ఆయనను బయటకు పంపించేశారు. అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ పుటేజీని కూడా పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.