Unlock 2 Guidelines in AP: జగన్ సర్కార్ అన్‌లాక్ 2.O మార్గదర్శకాలు ఇవే!

Unlock 2 Guidelines in AP:దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-02 16:04 GMT

Unlock 2 Guidelines in AP: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఏపీలో జగన్ సర్కార్ కూడా అన్‌లాక్‌ 2.0 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు అమలు చేయాలని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక అన్‌లాక్‌ 2.0కి సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది.

కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగించారు.. ఇక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థల బంద్ చేస్తునట్టుగా వెల్లడించింది..ఇక సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు మూసి వేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. ఈ నెల 15 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శిక్షణా కేంద్రాలకు అనుమతి ఇస్తారు.

ఏపీలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే..తాజాగా గడిచిన 24 గంటల్లో 812 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14285 శాంపిల్స్‌ని పరీక్షించగా 812 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 281 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 13,625 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 5868 మంది డిశ్చార్జి కాగా, 7,559 మంది చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News