Two young men were caught Red-Handed: కోటికి బేరమాడి పట్టుకున్నారు.. గుంటూరు జిల్లాలో అటవీ అధికారుల పన్నాగం
Two young men were caught Red-Handed: అటవీ జంతువులను వేటాడటం, అమ్మకం చేయడం నేరం.
Two young men were caught Red-Handed: అటవీ జంతువులను వేటాడటం, అమ్మకం చేయడం నేరం. అది ఎవరు చేసినా తప్పే. అటువంటిది శరీరంపై చిప్పలుగా ఉండే అలుగు జంతువును అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పన్నాగంతో పట్టుకున్నారు. తామే అలుగు కొంటామని నమ్మించి కటకటాల వెనక్కు నెట్టారు.
అరుదైన అడవి జంతువు అలుగును అమ్మేందుకు ప్రయత్నించిన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురానికి చెందిన ఇద్దర్ని అరెస్టు చేసినట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారి ప్రతీ్‌పకుమార్ తెలిపారు. గుంటూరులోని అరణ్యభవన్‌లో శుక్రవారం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు యువకులు అలుగు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటూ స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ ఇండియా సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ సిబ్బంది మారువేషాల్లో జగ్గాపురం వెళ్లి ఉయ్యాల శివయ్య, ఉయ్యాల కోటేశ్వరరావులను సంప్రదించారు. వారు అలుగును రూ.కోటికి బేరంపెట్టగా, రూ.60 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించి అలుగును అప్పగించిన నిందితులిద్దరినీ తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ప్రతీప్ కుమార్ తెలిపారు