Andhra Pradesh: భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు
Andhra Pradesh: కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు
Andhra Pradesh: శాఖ భీమిలి బీచ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం నిన్నటి నుంచి గాలిస్తున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం స్పీడ్ బోట్స్‌తో ముమ్మర గాలింపు చేపట్టారు. తగరపు వలసకు చెందిన అనిట్స్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కాలేజ్‌కు లేట్ కావడంతో భీమిలి బీచ్‌కు ముగ్గురు విద్యార్థులు వచ్చారు. ముందుగా GVMC జోనల్ కార్యాలయానికి సమీపంలోని సముద్రంలో ఈత కొట్టడానికి యత్నించారు. అయితే మెరైన్ కానిస్టేబుళ్లు గమనించి సముద్రం అల్లకల్లోలంగా ఉందని వారిని వెనక్కి పంపించేశారు. అక్కడ నుంచి బీచ్ రోడ్డులో ఉన్న సాగరకన్య విగ్రహం వద్దకు చేరుకున్న విద్యార్థులు.. తీరంలో బ్యాగ్‌లు పెట్టి సముద్రంలో ఈతకు దిగారు. దిగిన కొద్ది నిమిషాలకే సూర్యవంశీ కెరటాల్లో కొట్టుకుపోతుండగా సాయి రక్షించడానికి యత్నించాడు. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అది చూసి మణికంఠ వెనక్కి వచ్చేశాడు. అనంతరం భీమిలి పోలీసులు, రుషికొండ మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టారు. నేవి హెలికాఫ్టర్‌తో గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఇవాళ విద్యార్థుల కోసం మరోసారి గాలింపు చర్యలు చేపట్టనున్నారు. కాసేపట్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం కానుంది.