చంద్రబాబుపై వ్యాఖ్యలు.. రామ్ గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఇచ్చారు. హై

Update: 2024-11-13 06:28 GMT

చంద్రబాబుపై వ్యాఖ్యలు.. రామ్ గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఇచ్చారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. 2024 మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసు ఇచ్చారు.

వ్యూహం సినిమా విడుదల సమయంలో తనకు బెదిరింపులు వచ్చాయని... తనను బెదిరించినవారిపై చర్యలు తీసుకోవాలని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో అప్పటి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. 2024 మార్చి చివరలో స్వయంగా డీజీపీని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లాలో కూడా ఫిర్యాదు

గుంటూరు జిల్లాలో కూడా రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఎన్. రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News