Thirumala: కరోనాతో 5 నెలల పాటు శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత

Thirumala: ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లు జారీ

Update: 2021-09-05 11:46 GMT

తిరుమల దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

Thirumala: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్త జనం పోటీపడుతున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా దాదాపు 5 నెలలపాటు శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే జారీ చేస్తోంది. ప్రత్యేక ప్రవేశదర్శనం, ప్రముఖుల సిఫార్సులు, సుపథం వర్చువల్ సేవా, టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం చాలా రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్నారు.

కరోనా సెకెండ్ వేవ్ విజృంభించడంతో సర్వ దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్న టీటీడీ ఉచిత దర్శనాలపై నిర్ణయం తీసుకోక సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దూరం చేస్తోంది. సర్వ దర్శనాలు ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ తెలిపారు. త్వరలో సర్వ దర్శనాలు, ఉచిత దర్శనాలపై ప్రకటన వెలువడిస్తామని, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.

కోవిడ్‌ నిబంధనల పేరుతో దాదాపు 5 నెలలకు పైగా ఉచిత దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కేవలం 300 రూపాయలు, సిఫార్సు లెటర్లు, ఆన్‌‌లైన్‌ సేవలకే పరిమితం చేసింది. దీంతో సామాన్య భక్తులు ఆ స్వామిని దర్శించుకోలేకపోతున్నారు. సర్వదర్శనాలు లేకపోవడంతో తిరుమలేశుడు కొందరివాడైపోయాడని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనాలను తిరిగి టీటీడీ ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News