అరకు అందాలను ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు
* అరకులో మారిన వాతావరణం భూమిని తాకినట్లుగా మేఘాలు
Araku: కాశ్మీర్, సిమ్లా, కులు, మనాలి, ఊటీ, కొడైకెనాల్.. ఈ పేర్లు వింటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, కొండలు, లోయలు గుర్తుకు వస్తాయి.. జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశాలు అవి. సరిగ్గా వాటికి ఏమాత్రం తీసిపోని ప్రదేశం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. మారిన వాతావరణంతో అరకు లోయ కనువిందు చేస్తోంది. పచ్చని కొండలు, పంట పొలాలు.. భూమిని తాకినట్లుగా వస్తున్న మేఘాలతో ప్రకృతి రమణీయంగా మారింది. భూతల స్వర్గాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దట్టమైన పొగమంచు.. లేలేత భానుడి కిరణాల మధ్య పిల్లలు, పెద్దలు అరకు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.