తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు

*తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు* *తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న భక్తులు*

Update: 2019-10-18 11:46 GMT

                                                                   (తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగి పడుతున్నాయి, రెండవ ఘాట్ రోడ్డుగా పిలువబడే తిరుపతి నుండి తిరుమలకు ప్రయాణించే రహదారిలోని చివరి మలుపు వద్ద కొండచరియలు, బండరాళ్లు విరిగి రోడ్డుపై పడుతున్నాయి, దీంతో వాహన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతొంది,

విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది ఘటన స్థలానికి వెంటనే చేరుకుని బండరాళ్లును తొలగిస్తున్నారు, ఇటీవల 4 రోజుల పాటు కురిసిన వర్షాలతో పట్టుకోల్పోయి కొండ నుండి రాళ్లు విరిగిపడుతున్నాయి.....ఘాట్ రోడ్డులో వాహనాలు నడిపేటప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది.

Tags:    

Similar News