Rain Alert: తడ వద్ద తీరం దాటిన వాయుగుండం..ఆ జిల్లాల్లో భారీగా వరదలకు అవకాశం

Rain Alert: చెన్నై-నెల్లూరు మధ్యలో ఉన్న తడ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.

Update: 2024-10-17 02:28 GMT

Cyclone Dana: దానా సైక్లోన్ దారెటు?

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు పుదుచ్చేరి,నెల్లూరు మధ్యలో చెన్నై సమీపంలోని తడ వద్ద తీరం దాటింది. చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని దాటింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వాయుగుండం చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250కి.మీ,నెల్లూరుకు 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

ఈ నేపథ్యంలోనే కృష్ణపట్నం,నిజాంపట్నం, వాడరేవు, మచిలీపట్నం వరకు పోర్టులకు మూడో నెంబర్, గంగవరం, కాకినాడ, విశాఖ, కళింగపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ. తీరం దాటిన తర్వాత దక్షిణ కోస్తా, పరిసర తమిళనాడు ప్రాంతాలవైపు కదులుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

అనంతపురం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు తిరుపతిలోని ఏర్పేడులో 9.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. 

Tags:    

Similar News