TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఆర్జిత సేవా టికెట్లు..రూ. 300టికెట్ల కోటా తేదీలు రిలీజ్
TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఈ నెలలోనే 2025 జనవరి నాటి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాకు సంబంధంచిన తేదీను విడుదల చేసింది టీటీడీ.
TTD: తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నిత్యం తరలివస్తుంటారు. ఈక్రమంలో స్వామివారి దర్శనమే కాకుండా శ్రీవారికి సేవ చేసే భాగ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం కోసం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెలలో టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఏయే తేదీలో ఏయే టికెట్లను రిలీజ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవల కోటాను టీటీడీ రిలీజ్ చేయనుంది. వీటిలో కొన్నింటిని ఈనెల 21న ఉదయం 10గంటలకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోటా కింద ఆన్ లైన్ లో ఎంట్రీ చేసుకోవచ్చు. ఇదే నెల 22న ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవ, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్ 23న ఉదయం 10గంటలకు అంగ ప్రదక్షిణం, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఫ్రీ స్పెషల్ ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను రిలీజ్ చేస్తారు.
మరిన్ని వివరా లకోసం https://ttdevasthanams.ap.gov.inవెబ్ సైట్ ను సందర్శించవచ్చు.