Rain Alert: ఏపీకి మరో అల్పపీడనం ముప్పు..3రోజులపాటు భారీ వర్షాలు..మరి తెలంగాణలో?
Rain Alert: ఏపీకి మరోసారి వర్షగండం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి..ఏపీ ప్రభావం చూపుతుందని ఐఎండీ హెచ్చరించింది. మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.
గత నెల రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఏపీ, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరోసారి అల్పపీడనం రూపంలో ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపనుంది. దీంతో రానున్న రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రంపై వీచే గాలుల కారణంగా క్రమంగా బలపడుతుందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావం కారణంగా ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడి ఉపరితల ఆవర్తనం..క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వస్తోందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. దీంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో 11వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పడీనం కారణంగా ఏపీలోని ప్రకారం, నెల్లూరు, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖ జిల్లాల్లో సోమవారం నుంచి మూడు రోజులు భారీ వర్షాలు, మిగతా కొన్ని జిల్లాల్లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు నాలుగు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని వేటకు వెళ్లకూడదని మత్య్సకారులను హెచ్చరించింది ఐఎండీ.
ఇక తెలంగాణలో రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు పడే అవకాశం లేవని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే 12, 13వ తేదీల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.