AP Assembly Meetings: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్
AP Assembly Meetings: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని వైసీపీ అంటుంటే కాదు పూర్తి స్థాయి బడ్జెట్ అని ప్రభుత్వం స్పష్టతనిస్తుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాల తొలిరోజే బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఉదయం 9గంటలకు మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఈ మంత్రివర్గ భేటీలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పయ్యావుల కేశవర్ బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం.
10 నుంచి 11రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సమావేశాలు వాయిదా పడతాయి. శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలు, సెషన్ ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తారు. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టడంతోపాటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. బడ్జెట్ నిర్ణయాలను ఆయనకు వివరించినట్లు సమాచారం.
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నేటి నుంచి సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే సమావేశాల మొదటిరోజే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
ఉదయం 10గంటలకు సమావేశాలు షురూ కానున్నాయి. అంతకుముందు ఏపీ మంత్రివర్గం సమావేశమైన బడ్జెట్ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అలాగే ప్రవేశపెట్టబోయే బిల్లులను కూడా ఆమోదిస్తుంది.
అయితే శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడం, వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండటంతో వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్షనేత హోదా కోల్పోయారు. ఈ ఖారణంతోనే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. తనకు ప్రతిపక్షనాయకుడి హోదా కల్పిస్తే హాజరవుతారని చెప్పారు.
అయితే ప్రభుత్వం మాత్రం తమ 5ఏళ్ల పాలనలో చేపట్టబోయే పాలన గురించి ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో అమలు చేసిన వాటి గురించి ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనుంది.