వచ్చే నెల రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం

నవంబర్‌ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్‌ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటించనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్.

Update: 2020-10-31 16:17 GMT

నవంబర్‌ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్‌ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటించనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఈ నేపథ్యంలో పంట, ఆస్తి నష్టం అంచనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రెండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను సమర్పించనున్నారు అధికారులు. వరద కారణంగా 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనాకు వచ్చారు. ఆర్‌ అండ్ బీకి సుమారు 5 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు సమాచారం. సుమారు 10 వేల కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు అడగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News